Healthy Diet : చలికాలంలో పాలపదార్ధాలు, రెడ్ మీట్ తినడం తగ్గిస్తే మంచిది ఎందుకంటే..

Healthy Diet : వేసవి వేడి తగ్గింది.. ఓ వైపు వర్షాలు కురుస్తూ.. మెల్లగా చలి తరుముకొచ్చింది.. వాతావరణం వణికిస్తోంది.. రైన్ కోట్ సహా ఉన్ని దుస్తులను బయటకు తీసే సమయం..

Healthy Diet : చలికాలంలో పాలపదార్ధాలు, రెడ్ మీట్ తినడం తగ్గిస్తే మంచిది ఎందుకంటే..
Milk And Red Meat
Follow us

|

Updated on: Jun 24, 2021 | 9:02 PM

Healthy Diet : వేసవి వేడి తగ్గింది.. ఓ వైపు వర్షాలు కురుస్తూ.. మెల్లగా చలి తరుముకొచ్చింది.. వాతావరణం వణికిస్తోంది.. రైన్ కోట్ సహా ఉన్ని దుస్తులను బయటకు తీసే సమయం ఆసన్నం అయ్యింది.. అయితే ఈ కాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్దపెట్టాల్సి న ఆవశ్యకత ఎంతైనా ఉంది. . అంతేకాదు.. మనం తినే ఆహార విషయం లో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంది.. ఎందుకంటే ఈ చలికాలంలో కొన్ని పదార్ధాలను తినడం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఈ చలికాలంలో పాలు మరియు.. ఎర్రని మాసం తినడం చాలా తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు.. ముఖ్యంగా శీతాకాలంలో రెడ్ మీట్ అసలు తినవద్దు అని.. అందులో ఉండే అధిక ప్రోటీన్లు గొంతులోని మ్యూకస్ ను పెంచుతాయని.. అందుకనే ప్రాసెస్ చేసిన మాంసం.. అధిక కొవ్వు ఉన్న మాంసం తినవద్దు అని అంటున్నారు. అంతేకాదు.. పాలు.. పాల పదార్ధాల వినియోగం కూడా తగ్గించాలని చెబుతున్నారు. పాల వల్ల కఫం వస్తుంది.. లేదా కఫాన్ని మరింత అధికం చేస్తుంది.. దీని వల్ల గొంతులో గరగర మరియు అసౌకర్యం ఉంటుంది.

Also Read: గత 100 ఏళ్లలో ప్రపంచంలో అత్యధిక విరాళం ఇచ్చిన అభినవ దానకర్ణుడు మన భారతీయుడే.. ఎవరో తెలుసా..

జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ప్రకృతి ప్రసాదం ఆగాకార.. ఈ సీజన్ లో తినాల్సిందే