Spine Gourd Benefits: జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ప్రకృతి ప్రసాదం ఆగాకార.. ఈ సీజన్ లో తినాల్సిందే

Spine Gourd Benefits: సీజన్‌లో మాత్రమే లభించే కూరగాయ అడవి కాకర. అదేనండి ఆగాకర . ధర ఎక్కువే అయినా మార్కెట్‌లో అరుదుగా లభించడం వల్ల కొనుగోలుదారులు కోరి మరీ తెచ్చుకుంటారు.

Spine Gourd Benefits: జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ప్రకృతి ప్రసాదం ఆగాకార.. ఈ సీజన్ లో తినాల్సిందే
Agakara
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2021 | 7:55 PM

Spine Gourd Benefits: సీజన్‌లో మాత్రమే లభించే కూరగాయ అడవి కాకర. అదేనండి ఆగాకర . ధర ఎక్కువే అయినా మార్కెట్‌లో అరుదుగా లభించడం వల్ల కొనుగోలుదారులు కోరి మరీ తెచ్చుకుంటారు. దీంట్లో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. దీనికి ఆరగాకరకాయ, ఆగాకరకాయ, బోడకాకర కాయ అని చాలా పేర్లే ఉన్నాయి. మనకి మాములుగా దొరికే కాకర కాయ చేదుగా ఉంటుంది. దీనికి చేదు లేకపోయినా ఆ పేరుతో పిలుస్తారు. ఇక దీంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే.. ఎంత ధర అయినా కొనడానికి ఇష్టపడతారు అనడానికి సందేహం లేదు..

1. ఆగాకర కాయ మధు మేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ లెవల్స్‌ని పెంచుతుంది. మధుమేహం కారణంగా వచ్చే మిగతా అనారోగ్య సమస్యల్ని నివారిస్తుంది.

2. దీంట్లో ఉండే పైటో న్యూట్రియంట్స్ వల్ల కాన్సర్ కణితులు పెరకుండా ఉంటాయి. కాన్సర్ కారకాలను కూడా నాశనం చేస్తుంది.

3. గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన పోషకం. గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

4. విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు. దృష్టి సంబంధ సమస్యల్ని నివారిస్తుంది.

5. కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ కూరగాయ దొరికినన్నాళ్లు నిత్యం తింటూవుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. ప్రొటీన్లు, పీచుపదార్ధం అధికంగా ఉండడం వల్ల జీర్ణ క్రియ పని తీరును మెరుగుపరచడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలను నివారిస్తుంది.

Also Read: సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిన సోనూ సూద్ .. బ్రెడ్డు, గుడ్డు అన్నీ హోమ్ డెలివరీనే.. చార్జీలు అదనం