Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం ఎందుకు జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఒక ప్రత్యేకరకమైన అణువు దీనికి కారణం అని వారు అంటున్నారు.

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు
Blood Clot In Corona Patients
Follow us
KVD Varma

|

Updated on: Jun 24, 2021 | 7:42 PM

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం ఎందుకు జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఒక ప్రత్యేకరకమైన అణువు దీనికి కారణం అని వారు అంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఈ అణువు స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుంది. దీనివలన రోగి మరణించే ప్రమాదం పెరుగుతుంది అని పరిశోధకులు తెలిపారు. ఐర్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు ఏ విషయంపై పరిశోధన నిర్వహించారు. కరోనా రోగులలో రక్తం గడ్డకట్టడం ఎందుకు అని అర్థం చేసుకోవడానికి, డబ్లిన్‌లోని బ్యూమాంట్ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులపై ఈ పరిశోధనలు జరిగాయి. వారి రక్త నమూనాలను పరిశోధకులు తీసుకున్నారు. ఈ రోగులలో విడబ్ల్యుఎఫ్ అణువు అధిక స్థాయిలో ఉందని రక్త నివేదికలు వెల్లడించాయి. ఈ అణువు రక్తం గడ్డ కట్టడాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా వీరిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ADAMTS13 అణువు స్థాయి తక్కువగా ఉంది. ఈ రెండు అణువుల సమతుల్యత క్షీణించినప్పుడు, గడ్డకట్టడం మొదలవుతుంది. ఇలా గద్దకట్టడం మొదలవడం మరణానికి కారణమవుతుందని పరిశోధన రుజువు చేసింది . రక్తం గడ్డకట్టడం వల్ల చాలా మంది కరోనా రోగులు మరణించారని మునుపటి అనేక పరిశోధనలలో రుజువు అయింది.

కరోనా రోగుల ADAMTS13 మరియు VVF స్థాయిని నిర్వహించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమని పరిశోధకుడు డాక్టర్ జామీ ఓసుల్లివన్ చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది, దీని ప్రకారం కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం గురించి ఫిర్యాదు చేసిన 26 అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దుష్ప్రభావాలకు భయపడి చాలా దేశాలు ఈ టీకాను నిలిపివేసాయి. అయినప్పటికీ, కోవిషీల్డ్ దుష్ప్రభావాలు ఈ టీకా యొక్క ప్రయోజనాల కంటే చాలా తక్కువ అని చాలా మంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవ్‌షీల్డ్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాన్ని భారతదేశంలో గుర్తించడం ఇదే మొదటిసారి.

మొత్తం 498 కేసులను వారు అధ్యయనం చేసినట్లు మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటిలో, కోవిషీల్డ్ వ్యాక్సిన్ పొందిన తరువాత రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్న 26 కేసులను మాత్రమే వారు కనుగొన్నారు. అదేవిధంగా కోవాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం లేదా రక్తస్రావం సమస్యలు ఏవీ ఇంతవరకూ తెలియలేదు.

Also Read: Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా… కరోనా రక్కసి మింగేస్తోంది..

Fake vaccination: ముంబైలో భారీగా ఫేక్ వ్యాక్సినేషన్లు… బూటకపు క్యాంపుల్లో రెండు వేలమందికి పైగా టీకా మందు !

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..