Accident : అనంతపురం జిల్లాలో దారుణ యాక్సిడెంట్..లారీ, బైక్ ఢీ..ఇద్దరు సజీవ దహనం

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 67 వ నంబర్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామం దగ్గర్లో... లారీని బైక్ ఢీ కొట్టింది.

Accident : అనంతపురం జిల్లాలో దారుణ యాక్సిడెంట్..లారీ, బైక్ ఢీ..ఇద్దరు సజీవ దహనం
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2020 | 7:06 PM

Accident :  అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని 67 వ నంబర్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామం దగ్గర్లో… లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో లారీ డీజిల్​ ట్యాంక్, బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ యాక్సిడెంట్‌లో లారీ పూర్తిగా దగ్ధం కాగా… ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మృతులు యాడికి మండలం భోగాలకట్ట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి, రోషి రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటన జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారందరు చూస్తుండగానే చోటుచేసుకుంది. కళ్లముందే వారు సజీవదహనం అవుతున్నా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ దుర్ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..విచారణ జరుపుతున్నారు.

Also Read : 

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం