AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌ను వీడని అండర్‌వాల్డ్‌ డాన్ నెట్‌వర్క్..24 ఏళ్ల తర్వాత పట్టుబడిన దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు

అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు మరోసారి రుజువయ్యింది. డీ గ్యాంగ్‌ ముఖ్య అనుచరుడు మాజిద్ కుట్టీని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 24 ఏళ్ల నుంచి మాజిద్‌ కుట్టి కోసం పోలీసులు..

భారత్‌ను వీడని అండర్‌వాల్డ్‌ డాన్ నెట్‌వర్క్..24 ఏళ్ల తర్వాత పట్టుబడిన దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు
Sanjay Kasula
|

Updated on: Dec 27, 2020 | 7:34 PM

Share

అండర్‌వాల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం నెట్‌వర్క్‌ దేశవ్యాప్తంగా విస్తరించినట్టు మరోసారి రుజువయ్యింది. డీ గ్యాంగ్‌ ముఖ్య అనుచరుడు మాజిద్ కుట్టీని గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 24 ఏళ్ల నుంచి మాజిద్‌ కుట్టి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు జార్ఖండ్‌లో చిక్కాడు మాజిద్‌ కుట్టి.

1996 నుంచి ఆయన కోసం వెదుకుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. 106 పిస్టల్స్‌ , 4 కిలోల ఆర్డిఎక్స్‌ను దావూద్‌ గ్యాంగ్‌ కోసం సేకరించినట్టు మాజిద్‌ కుట్టీపై అభియోగాలున్నాయి. కుట్టీతో పాటు ఈ కేసుతో సంబంధమున్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పేలుళ్ల కేసులో కూడా కుట్టీకి సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

1997లో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా గుజరాత్, మహారాష్ట్రలో బాంబు పేలుళ్లు జరిపేందుకు అతడు ప్రయత్నించాడు. పాకిస్తాన్‌ ఏజెన్సీ ఆదేశాల మేరకు దావూద్ ఇబ్రహీం పంపిన పేలుడు పదార్థాలకు సంబంధించిన కేసులో నిందితుడైన అబ్దుల్ మజీద్ కుట్టిని అరెస్ట్‌ చేశారు.

Follow Us
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే బీట్రూట్ పల్లీల చట్నీ..
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాలలో కలకలం!
ప్లాస్టిక్ సంచిలో బాలుడు, బాలిక బొమ్మలు.. జగిత్యాలలో కలకలం!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
దిగ్బల యోగంతో వీరికి ఉద్యోగంలో గోల్డెన్ డేస్..!
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
శివ ఫస్ట్ డే షూటింగ్‏లో ఆర్జీవీ చెప్పిన మాటకు గుండె కొట్టుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే..
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!
అద్దె బకాయి.. ఇంటి నుంచి గెంటివేత.. పెట్టెలోని ఫొటో చూసి PM ఫోన్!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!
భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!
రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌
రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌
ఆ ట్రోఫీలోకి రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడంటే?
ఆ ట్రోఫీలోకి రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడంటే?