ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జేసీబీని ఢీకొన్న బైక్.. ఇద్దరు యువకుల దుర్మరణం
అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.
అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద వేగంగా వచ్చిన బైక్ జేసీబీని ఢీకొట్టింది. బైక్‌పై వస్తున్న నరేష్(22), గణేష్(20) అనే ఇద్దరు యువకుల అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు నుంచి బైక్ అతి వేగంగా వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను భువనగిరి ఆకుతోటబావి తండా సూరేపల్లికి చెందిన నరేష్, ఘాట్‌కేసర్ సమీపంలోని పోచారం గ్రామానికి చెందిన గణేష్‌గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.