COVID Vaccine : మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం

ఇప్పటికే కొన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియా కూడా 2021 జనవరిలో వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనుంది. ఈ మహమ్మారి వైరస్ తో విసిగి వేసారిన ప్రపంచంలోని పలు దేశాలు..

COVID Vaccine : మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 27, 2020 | 3:07 PM

ఇప్పటికే కొన్ని దేశాలలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియా కూడా 2021 జనవరిలో వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనుంది. ఈ మహమ్మారి వైరస్ తో విసిగి వేసారిన ప్రపంచంలోని పలు దేశాలు..వ్యాక్సిన్ కోసం ఇండియావైపు చూస్తున్నాయి. 2020 లో మహమ్మారి ప్రపంచాన్ని తాకినప్పుడు..భారతీయ ఫార్మా ఇండస్ట్రీ ప్రపంచ దేశాలకు మెడిసిన్ పరంగా ఎంతో సాయం చేసింది. హెచ్‌సిక్యూ, పారాసెటమాల్ వంటి మెడిసిన్ ను ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలకు ఎగుమతి చేసింది.

తాజాగా మహమ్మారిని నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ తయారీ, సప్లై కోసం మరోసారి ప్రపంచం..ఇండియా వైపు చూస్తుంది. “ప్రపంచ వ‌్యాప్తంగా అవసరమైన వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశం వాటా 60 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ల  పంపిణీలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది” అని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపిఎ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ చెప్పారు. భారతీయ కంపెనీలైన జైడస్, భారత్ బయోటెక్, జెన్నోవా దేశీయ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తుండగా..మరికొన్ని దేశీయ కంపెనీలు గ్లోబల్ కంపెనీలతో  (సీరం ఇన్స్టిట్యూట్- ఆస్ట్రాజెనెకా, డాక్టర్ రెడ్డీస్- స్పుత్నిక్,  బయోలాజికల్ ఇ- జె అండ్ జె) కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు.  టీకా పంపిణీలో భారతదేశం కీలక భూమిక పోషించబోతంని.. దశలవారీగా పంపిణీని జరపడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందని ఆయన చెప్పారు. కోవిడ్  పరిస్థితిని నుంచి బయటపడటానికి ప్రపంచలోని దేశాల మధ్య సహకారం,  సమన్వయం ముఖ్యమని సుదర్శన్ జైన్ అన్నారు.

ప్రస్తుతం భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్ కంపెనీల వ్యాక్సిన్లు సమర్థతను ప్రదర్శిస్తున్నాయని.. ఈ మూడింటికి లేదా ముందుగా ఒక కంపెనీకి లైసెన్స్ లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ ఔషధ తయారీదారుల సంఘం (ఐడిఎంఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మదన్ మాట్లాడుతూ.. “టీకాలు జనవరి 2021 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కఠినమైన అంతర్జాతీయ నిబంధనల పాటించిన ఈ టీకాలను  డ్రగ్స్ కంట్రోలర్ ఆమోదించారు. డబ్ల్యూ.హెచ్.ఓ వ్యాక్సిన్ సేకరణలో దాదాపు 70 శాతం భారతదేశం నుంచి వస్తున్నందుకు మేము గర్విస్తున్నాము ” అని చెప్పారు.  ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ లభ్యతపై, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  సీఈఓ అదార్ పూనవల్లా మాట్లాడుతూ… ఇండియా, యూకేలో ట్రయల్ ఫలితాల ఆధారంగా, రెగ్యులేటరీ సంస్థల నుంచి త్వరగా గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. జనవరి 2021 నాటికి భారతదేశంలో లభిస్తుందని చెప్పారు.

Also Read : Strain Virus: నెల్లూరులో కలకలం.. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తికి స్ట్రెయిన్ పాజిటివ్‌గా నిర్ధారణ…

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.