వివాహ బంధంతో ఒక్కటైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యూపీలోని రాయ్‌బరేలికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్, పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్‌నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్‌ల వివాహం గత రాత్రి ఢిల్లీలో గ్రాండ్‌గా జరిగింది. వీరి వివాహ రిసెప్షన్‌  ఈ నెల 25న  నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తొలిసారి శాసనసభకు […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:31 am, Fri, 22 November 19
వివాహ బంధంతో ఒక్కటైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాకపోతే వారిద్దరూ వేరు, వేరు రాష్ట్రాల నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరి పెళ్లి న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యూపీలోని రాయ్‌బరేలికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్, పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్‌నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్‌ల వివాహం గత రాత్రి ఢిల్లీలో గ్రాండ్‌గా జరిగింది. వీరి వివాహ రిసెప్షన్‌  ఈ నెల 25న  నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తొలిసారి శాసనసభకు ఎన్నికయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒకే ఏడాది ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. అంగద్ కంటే.. అతిధి నాలుగేళ్లు పెద్ద.  అయినప్పటికీ ఇద్దరూ వివాహం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంగద్ తండ్రి,  దివంగత ప్రకాష్ సింగ్ సైనీ…. అదితి తండ్రి, దివంగత అఖిలేష్ సింగ్ కూడా పలుసార్లు చట్టసభలకు ప్రాతినిథ్యం వహించారు.