లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు..

పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు.  పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే లవర్ కోసం అమ్మ నగలను, ఆమె దాచుకున్న డబ్బును దోచుకెళ్లాడు ఓ ప్రబుద్దుడు.  హైదరాబాద్‌లోని బోరబండలోని ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో నివసించే అరుణ్ అనే యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. […]

లవర్ కోసం అమ్మ నగలు దోచుకెళ్లాడు..
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 4:44 PM

పెళ్లి అయ్యాక భార్య చెప్పుడు మాటలు విని..కని, పెంచి పోషించిన అమ్మని అశ్రద్ద చేసి బాధించే కొడుకులు ఇప్పుడు కోకొల్లలు.  పెళ్లి కాకముందు నుంచే లవర్ చుట్టూ తిరుగుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే లవర్ కోసం అమ్మ నగలను, ఆమె దాచుకున్న డబ్బును దోచుకెళ్లాడు ఓ ప్రబుద్దుడు.  హైదరాబాద్‌లోని బోరబండలోని ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో నివసించే అరుణ్ అనే యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. మనోడిది కాస్త కాస్ట్లీ లవ్ లేండి. అంటే అమ్మాయికి ఆశ్యర్చపరిచే గిప్టులు ఇవ్వాలి. వీకెండ్స్‌లో పార్టీలు, ఔటింగ్‌లు సరేసరి. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ సంపాదనే లేదు సదరు అరుణ్ బాబుకి. కానీ అవతల గర్ల్ ప్రెండ్‌కి ఏం తక్కువ చెయ్యకూడదు. దీంతో చెయ్యాల్సిన వరకు అప్పులు చేశాడు. ఇక ఎక్కడా డబ్బు పుట్టకపోయేసరికి అమ్మ నగలకే ఎసరు పెట్టాడు. వన్ ఫైన్ డే..ఆమె దాచుకున్న 8 తులాల బంగారం, 50 వేల డబ్బుతో ఎస్కేప్ అయ్యాడు. కేడీ కొడుకు చోరిని గుర్తించిన అతని అమ్మ..ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరుణ్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.