ఈవ్ టీజర్స్‌కు..ఆ అమ్మాయి ఎలా బుద్ది చెప్పిందో చూడండి..
కర్నాటకలోని షిమోగలో ఓ ప్రేమజంటను అల్లరిమూక టార్గెట్ చేయగా, ప్రియురాలు వారిని ఎదిరించింది. తన ప్రియుడిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ జంటను టార్గెట్ చేసిన యువకులు, ప్రియురాలితో ఉన్న ప్రియుడిని కిందపడేసి చితకబాదారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఆ అమ్మాయి బెదిరిపోలేదు. ధైర్యంగా అల్లరిమూకను ఎదుర్కొంది. తన ప్రియుడిని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నించింది. సోషల్ మీడియాలో ఈ […]
కర్నాటకలోని షిమోగలో ఓ ప్రేమజంటను అల్లరిమూక టార్గెట్ చేయగా, ప్రియురాలు వారిని ఎదిరించింది. తన ప్రియుడిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ జంటను టార్గెట్ చేసిన యువకులు, ప్రియురాలితో ఉన్న ప్రియుడిని కిందపడేసి చితకబాదారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి.
అయితే ఆ అమ్మాయి బెదిరిపోలేదు. ధైర్యంగా అల్లరిమూకను ఎదుర్కొంది. తన ప్రియుడిని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నించింది. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్‌గా మారడంతో శివమొగ్గ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోలో కనిపించిన వారిని గుర్తించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.