AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల దుర్మరణం

గుంటూరు నగర శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు.

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల దుర్మరణం
Balaraju Goud
|

Updated on: Oct 26, 2020 | 4:21 PM

Share

గుంటూరు నగర శివారులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. గుంటూరు శివారులోని అంకిరెడ్డిపాలెంలో ఈ విషాద ఘటన జరిగింది. ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు కౌశిక్ రెడ్డి(7), పృథ్వితేజ రెడ్డి(9)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాకు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Follow Us