ట్వీట్లతో మరోసారి రచ్చకెక్కిన ఆ ఇద్దరూ..

గత కొద్ది రోజులుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా ఫేస్‌బుక్‌లో పీవీపీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని పరోక్ష విమర్శలు చేశారు. జగన్‌ పేరును ప్రస్తావిస్తూ.. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడని.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన అనంతరం శ్రీరంగ నీతులు చెప్పమనండంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుందని కేశినేని ట్వీట్ చేశారు. దీనిపై పీవీపీ […]

ట్వీట్లతో మరోసారి రచ్చకెక్కిన ఆ ఇద్దరూ..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 3:19 PM

గత కొద్ది రోజులుగా టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా ఫేస్‌బుక్‌లో పీవీపీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని పరోక్ష విమర్శలు చేశారు. జగన్‌ పేరును ప్రస్తావిస్తూ.. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడని.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన అనంతరం శ్రీరంగ నీతులు చెప్పమనండంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుందని కేశినేని ట్వీట్ చేశారు.

దీనిపై పీవీపీ స్పందిస్తూ టీడీపీ మేనిఫెస్టోపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతి జిల్లాలో 80శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటూ టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో పేజీ నెం. 23 అంటూ హైలెట్ చేసి మరీ చెప్పారు. దేవుడా.. టీడీపీ నేతలకు గజినీ మెమరీ ఇచ్చావంటూ కామెంట్ చేశారు. ఒకరిపై మరొకరు నేరుగా విరమ్శలు చేసుకోకుండా.. ఇలా ట్వీట్ల ద్వారా ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.