AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసభ్యంగా వ్యాఖ్యానించాను, అందుకు మన్నించండి…

శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ 800 సినిమాలో నటించకూడదంటూ విజయ్‌ సేతుపతికి సలహాలు, సూచనలు ఇచ్చారు కొందరు.. కొందరు బెదిరించారు.. మరికొందరు హద్దులు దాటారు.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయి.. కొందరే విజయ్‌సేతుపతికి అండగా నిలిచారు.. ఈ గొడవలన్నీ ఎందుకనుకున్నారో ఏమో విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నారు.. శ్రీలంకకు చెందిన ఓ యువకుడైతే విజయ్‌ సేతుపతి కూతురును అత్యాచారం చేస్తానంటూ బెదిరించాడు.. ఇప్పుడు అతడే విజయ్‌ సేతుపతికి వీడియో ద్వారా క్షమాపణలు […]

అసభ్యంగా వ్యాఖ్యానించాను, అందుకు మన్నించండి...
Balu
|

Updated on: Oct 27, 2020 | 5:53 PM

Share

శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ 800 సినిమాలో నటించకూడదంటూ విజయ్‌ సేతుపతికి సలహాలు, సూచనలు ఇచ్చారు కొందరు.. కొందరు బెదిరించారు.. మరికొందరు హద్దులు దాటారు.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు విమర్శలకు దిగాయి.. కొందరే విజయ్‌సేతుపతికి అండగా నిలిచారు.. ఈ గొడవలన్నీ ఎందుకనుకున్నారో ఏమో విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్నారు.. శ్రీలంకకు చెందిన ఓ యువకుడైతే విజయ్‌ సేతుపతి కూతురును అత్యాచారం చేస్తానంటూ బెదిరించాడు.. ఇప్పుడు అతడే విజయ్‌ సేతుపతికి వీడియో ద్వారా క్షమాపణలు చెప్పాడు. విజయ్‌ సేతుపతి కూతురును ఉద్దేశిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసింది తానేనని ఒప్పుకున్నాడు.. కరోనా సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయిన బాధలో, ఆవేదనలో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో ఉచ్చనీచాలు మర్చిపోయానని తెలిపాడు. తాను చేసింది ఘోరమైన తప్పిదమని తెలుసని అన్నాడు.. తన కుటుంబానికి సమస్యలు రాకూడదనే వీడియోలో ముఖం చూపించడం లేదని, విజయ్‌ సేతుపతి తనను ఓ తమ్ముడిలా భావించి క్షమించాలని వేడుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు, మీడియా మిత్రులు తనను మన్నించాలని అభ్యర్థించాడు..

Follow Us