ఫేమస్ నటిపై రూమ్‌మేట్ దాడి..తీవ్ర గాయాలు

ఫేమస్ బుల్లితెర నటి నళిని నేగిపై ఆమె రూమ్‌మేట్‌ దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు నళిని ముంబయిలోని ఓషివారా పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రూమ్‌ మేట్‌ ప్రీతి, ఆమె తల్లి స్నేహలత కలిసి తన ముఖాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు వస్తున్నారని, గదిని ఖాళీ చేయమని వారిని నటి అడగడంతో తనపై దాడికి దిగారని చెప్పారు.  గతంలో వీరిద్దరూ కలిసే ఉన్నారు. మధ్యలో రూమ్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:04 pm, Fri, 30 August 19
ఫేమస్ నటిపై రూమ్‌మేట్ దాడి..తీవ్ర గాయాలు
Naamkarann actress Nalini Negi files FIR against roommate for physical assault

ఫేమస్ బుల్లితెర నటి నళిని నేగిపై ఆమె రూమ్‌మేట్‌ దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ మేరకు నళిని ముంబయిలోని ఓషివారా పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రూమ్‌ మేట్‌ ప్రీతి, ఆమె తల్లి స్నేహలత కలిసి తన ముఖాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు వస్తున్నారని, గదిని ఖాళీ చేయమని వారిని నటి అడగడంతో తనపై దాడికి దిగారని చెప్పారు.  గతంలో వీరిద్దరూ కలిసే ఉన్నారు. మధ్యలో రూమ్ మారిన నళిని..తన షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల ప్రీతి..నళినిని కలిసి తనకు కొంతకాలం ఆశ్రయవివ్వాలని కోరింది. అందుకు నటి ఒప్పుకుంది. ఎన్నిరోజులైనా రూమ్ వెకేట్ చేయకపోగా..పేరెంట్స్ వస్తున్నారని బయటకు వెళ్లమంటే దాడి చేశారని నళిని పోలీసులు ముందు వాపోయింది.