జగన్ హామీతో జలాల సద్వినియోగం… కేసీఆర్

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని తాను సోమవారం విజయవాడలో కలుసుకున్నానని, తెలంగాణాలో వర్షాభావ ప్రాంతాలకు సేద్యపు నీటిని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సాధ్యమైనంత ఎక్కువగా సేద్యపునీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటి […]

జగన్ హామీతో జలాల సద్వినియోగం... కేసీఆర్
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 5:36 PM

గోదావరి-కృష్ణా నదీ జలాలను వినియోగించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పని చేస్తాయని తెలంగాణ సిఎం కేసీఆర్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో సౌహార్ద, స్నేహ సంబంధాలను కొనసాగించాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని తాను సోమవారం విజయవాడలో కలుసుకున్నానని, తెలంగాణాలో వర్షాభావ ప్రాంతాలకు సేద్యపు నీటిని ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని కేసీఆర్ వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ సాధ్యమైనంత ఎక్కువగా సేద్యపునీటిని వినియోగించుకోవాలనుకుంటున్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో ప్రతి నీటి చుక్కనూ వాడుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన చెప్పారు. బచావత్ అవార్డు ప్రకారం గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811 టీఎంసీలను ఇదివరకటి ఏపీకి కేటాయించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. వరదలు, వర్షాల సీజన్ లో ఈ రెండు నదులకు సంబంధించి ప్రతి ఏడాదీ 4,500 టీఎంసీలు వృధాగా బంగాళాఖాతంలోకలుస్తున్నాయి. కేంద్ర జలసంఘం తన రికార్డుల్లో ఇదే విషయాన్ని పేర్కొంది అని ఆయన చెప్పారు. ఈ నదీజలాలను సమానంగా వినియోగించుకోవడానికి అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్రాలూ అంగీకరించాయని, ఈ బృందం తొలి సమావేశం హైదరాబాద్ లో ఈ నెల 27 న జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. తరువాతి భేటీ విజయవాడలో జరుగుతుందన్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం మైత్రీ పూర్వకంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ అన్నారు. ఆ రాష్ట్రాల తోడ్పాటుతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడతామన్నారు. గత నాలుగేళ్లలో కర్ణాటకతో మూడు సార్లు మంచి నీటిని ఇచ్చి పుచ్ఛుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఏపీలోని ఇదివరకటి ప్రభుత్వం తెలంగాణతో నదీజలాల పంపకం విషయంలో విభేదాలకు ఆజ్యం పోసిందన్నారు.

Latest Articles
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
MRP అంటే ఏమిటి? అంతకుమించిన ధర అడిగితే ఏం చేయాలి? పూర్తి వివరాలు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే జనరల్ టికెట్లు..
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
మే 1 నుంచి కీలక మార్పులు.. మీ జేబుపై ప్రభావం ఉంటుందా?
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
చాణక్య చెప్పినట్లు పొరపాటున కూడా ఈ నలుగురితో స్నేహం చేయకండి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్రూట్‌ జ్యూస్‌ తాగుతున్నారా..? ఏమవుతుందంటే
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
అవి మీ ప్రశాంతతను దూరం చేస్తాయి.. అసలు పట్టించుకోకండి..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..
గరుడ పురాణం ప్రకారం ఈ ఐదుగురితో కలిసి ఎన్నడూ భోజనం చేయవద్దు..
ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌
ఎన్నికల వేళ శుభవార్త.. సామాన్యులకు ఊరట.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!
ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!
ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో భైరవ.. ప్రభాస్ లుక్ అదుర్స్..
ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో భైరవ.. ప్రభాస్ లుక్ అదుర్స్..