AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు రోషన్‌ బేగ్‌ను సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని కేపీసీసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్‌ బేగ్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన రోషన్‌ బేగ్‌.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ […]

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
Ram Naramaneni
|

Updated on: Jun 19, 2019 | 1:47 PM

Share

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌పై ఆ పార్టీ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు రోషన్‌ బేగ్‌ను సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని కేపీసీసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. ‘రోషన్‌ బేగ్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ కేపీసీసీ పంపిన నిర్ణయాన్ని ఏఐసీసీ ఆమోదించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయిన రోషన్‌ బేగ్‌.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫలితంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు’ ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా రోషన్‌ బేగ్‌ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో​ కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తం 25 స్థానాలకు అన్నీటిలోనూ బీజేపీ ఘన విజయం సాధించడంపై రోషన్ బేగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షు డు దినేశ్‌ గుండూరావు అసమర్థుడని, మాజీ సీఎం సిద్దరామయ్య అహంకారి అని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ జోకర్‌ అని రోషన్‌ బేగ్‌ తిట్టిపోశారు. దీంతో అధిష్ఠానం వేటు వేసింది.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి