Anaparthi Politics Live Updates : హీటెక్కిన తూర్పు గోదావరి రాజకీయం.. ముగిసిన సత్య ప్రమాణాలు..మరో టర్నింగ్ తీసుకున్న అనపర్తి రచ్చ..
బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రమాణాలు చేశారు. మాటంటే మాటే అంటూ.. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సతీ సమేతంగా ఆలయానికి వచ్చి ప్రమాణం చేశారు.

Anaparthi Politics Live Updates : తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాలు పొలిటికల్ వార్ జోన్‌గా మారిపోయాయి. సత్య ప్రమాణాలు పూర్తయ్యాయి. వివాదం మాత్రం పరిష్కారం కాకుండా అలానే ఉంది. శ్రీలక్ష్మీ గణపతి సాక్షిగా… ప్రమాణం చేసినా ఆరోపణలకు ఎండ్‌కార్డ్ పడలేదు. పైగా అనపర్తి సవాళ్ల రాజకీయం మరో టర్నింగ్ తీసుకుంది. దేవుడి ముందే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గొడవ పడ్డారు.
LIVE NEWS & UPDATES
-
ఆలయానికి వెళ్లిన వాళ్లు… బయటకు వచ్చి మళ్లీ అవే ఆరోపణలు..
ఆరోపణలు చేసుకుని ఆలయానికి వెళ్లిన వాళ్లు… బయటకు వచ్చి మళ్లీ అవే ఆరోపణలు చేసుకున్నారు. గణపతి దగ్గర ప్రమాణం చేసినా… వివాదం మాత్రం సమసిపోలేదు. పైగా ఇప్పుడు ప్రమాణం చేయడంపై మరో వివాదం మొదలైంది.
-
నిజాయితీగా ప్రమాణం చేయలేదు..నల్లమిల్లిని తాము పట్టించుకోబోము-ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి
తాము చేసినట్లు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ప్రమాణం చేయలేదన్నది ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పించారు. ప్రమాణం చేసేటప్పుడు నల్లమిల్లి సతీమణి చేయి తీసేశారని అన్నారు. నిజాయితీగా ప్రమాణం చేయలేదు కాబట్టి… ఇకపై నల్లమిల్లిని తాము పట్టించుకోబోమని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
-
-
ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ, ఆయన సతీమణి ఇద్దరూ ప్రమాణం
ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ, ఆయన సతీమణి ఇద్దరూ ప్రమాణం చేశారు. మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదని ప్రమాణం చేశారు ఎమ్మెల్యే. అందులో నిజం ఉంటే… తనను శిక్షించాలని, లేదంటే మాజీ ఎమ్మెల్యేను శిక్షించాలంటూ ప్రమాణం చేశారు. ఆయన సతీమణి కూడా ఇదే రకంగా ప్రమాణం చేశారు.
-
అనపర్తిలో హీటెక్కిన రాజకీయం… ప్రమాణ సమయంలో వాగ్వాదం
నేతలతో పాటు అతికొద్ది మందిని మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. ప్రమాణ సమయంలో వాగ్వాదం నడిచింది. ప్రమాణం చేసేటప్పుడు నల్లమిల్లి సతీమణి చేయి తీసేశారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చెబితే… అదంతా పచ్చి అబద్ధమని, తాను ప్రమాణం చేశానని చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే భార్య. ఎమ్మెల్యేనే ఊగిపోతూ దుర్బాషలాడారని ఆరోపించారు నల్లమిల్లి. ఎన్నిసార్లు ప్రమాణం చేయడానికైనా సిద్ధమని మరో సవాల్ విసిరారు.
-
దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి దంపతులు
ఉదయం నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు అనపర్తి, బిక్కవోలులో హైటెన్షన్ నెలకొంది. మూడు నిమిషాల వ్యవధిలోనే బిక్కవోలు ఆలయానికి చేరుకున్నారు సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి దంపతులు. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇరువురు నేతలు సతీ సమేతంగా లోపలకు వెళ్లారు. నేతలతో పాటు అతికొద్ది మందిని మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. ప్రమాణ సమయంలో వాగ్వాదం నడిచింది. ప్రమాణం చేసేటప్పుడు నల్లమిల్లి సతీమణి చేయి తీసేశారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చెబితే… అదంతా పచ్చి అబద్ధమని, తాను ప్రమాణం చేశానని చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే భార్య. ఎమ్మెల్యేనే ఊగిపోతూ దుర్బాషలాడారని ఆరోపించారు నల్లమిల్లి. ఎన్నిసార్లు ప్రమాణం చేయడానికైనా సిద్ధమని మరో సవాల్ విసిరారు.
-
Published On - Dec 23,2020 4:51 PM




