విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతి నెల రూ.15 వేల వరకు స్కాలర్ షిప్.. వారికి మాత్రమే ఛాన్స్..

ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త అందించింది డీఆర్‏డీవో. చదువుకుంటున్న వారి కోసం ప్రతి నెల రూ.15,500 స్కాలర్ షిప్‏ను అందించనుంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రతి నెల రూ.15 వేల వరకు స్కాలర్ షిప్.. వారికి మాత్రమే ఛాన్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2020 | 4:28 PM

ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త అందించింది డీఆర్‏డీవో. చదువుకుంటున్న వారి కోసం ప్రతి నెల రూ.15,500 స్కాలర్ షిప్‏ను అందించనుంది. కానీ ఇందుకు అందరు విద్యార్థులు అర్హులు కాదండోయ్. ఢిపెన్స్ రీసెర్చ్ డెవలప్‏మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‏డీవో అర్హత కలగిన అమ్మాయిలకు మాత్రమే ఈ స్కాలర్ షిప్ అందిస్తుంది. ఇందుకు అప్లై చేయడానికి డిసెంబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉంది.

ఈ స్కాలర్ షిప్ కోసం బీఈ, బీటెక్, ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిలు ఆన్‏లైన్‏లో అప్లై చేసుకోవచ్చు. అంతే కాకుండా గేట్, జేఈఈ విద్యార్థులు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ ఇందులో కేవలం 30 మంది అమ్మాయిలకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అటు బీఈ, బీటెక్ చదివే అమ్మాయిలలో కేవలం 20 మందికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ లభిస్తుంది. మొత్తంగా వీరికి ఏడాదికి రూ.1.2 లక్షలు వస్తాయి. ఈ స్కాలర్ షిప్ 4 సంవత్సరాలపాటు వస్తుంది. కాగా మిగిలిన 10 స్కాలర్ షిప్స్ ఎంటెక్, ఎంఈ, ఎంఎస్‏సీ ఇంజినీరింగ్ చదివే వారికి లభిస్తుంది. విద్యార్థులకు నెలకు రూ.15,500 రెండు సంవత్సరాల పాటు ఈ స్కాలర్ షిప్ అందించనున్నారు. ఈ స్కాలర్ షిప్‏కు సంబంధించిన పూర్తి వివరాలను DRDO వెబ్‏సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ https://rac.gov.in/cgibin/2020/advt_ardb02/ లింక్ పై క్లిక్ చేసి డైరెక్ట్‏గా అప్లై చేసుకోవచ్చు