చాకోలేట్‌తో బాలుకు నివాళి.. కొత్త సంవత్సర వేడుకల్లో ఎస్పీబీ చాకోలేట్ విగ్రహం.. వెరైటీగా బేకరీ సేల్స్

రెండు నెలల క్రితం స్వర్గస్తులైన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్హణ్యానికి వెరైటీగా నివాళులు అర్పించింది ఓ బేకరీ సంస్థ. వెరైటీ నివాళితోపాటు..

  • Rajesh Sharma
  • Publish Date - 4:00 pm, Wed, 23 December 20
చాకోలేట్‌తో బాలుకు నివాళి.. కొత్త సంవత్సర వేడుకల్లో ఎస్పీబీ చాకోలేట్ విగ్రహం.. వెరైటీగా బేకరీ సేల్స్

Chocolate tributes to late singer Balu: రెండు నెలల క్రితం స్వర్గస్తులైన లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్హణ్యానికి వెరైటీగా నివాళులు అర్పించింది ఓ బేకరీ సంస్థ. వెరైటీ నివాళితోపాటు.. బిజినెస్‌ పెంచుకునేందుకు స్ట్రాటెజీ రచించింది. తమ ప్రయత్నం సక్సెస్ కావడంతో ఆ బేకరీకి జనం పోటెత్తారు. నివాళికి నివాళి.. బిజినెస్‌కు బిజినెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు సందర్శకులు.

పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకుంటోంది ఓ బేకరీ సంస్థ. చాకోలేట్‌‌తో ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది జునిక బేకరీ. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి నివాళిగా 339 కిలోల చాకోలేట్‌తో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది.

పుదుచ్చేరిలోని జునిక బేకరీలో ఉన్న బాలు చాకోలేట్ విగ్రహాన్ని చూడడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు అభిమానులు. ఒక గొప్ప గాయకుని చాకోలేట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బేకరీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. బాలుకి నివాళులు అర్పించే పేరిట బిజినెస్ పెంచుకునేందుకు వేసిన ఎత్తుగడ సక్సెస్ కావడంతో సదరు బేకరీ సంస్థ యజమాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.