వివాహం తర్వాత కొత్త సినిమాకు ఓకే చెప్పిన టాలీవుడ్ చందమామ.. ప్రభుదేవాతో జోడికట్టనున్న ముద్దుగుమ్మ.

ప్రస్తుతం మోసగాళ్లు, ఆచార్య, భారతీయుడు2, ముంబై సగా, పారిస్ పారిస్ వంటి బహు భాష చిత్రాల్లో బిజీగా నటిస్తోన్న కాజల్ కొత్తగా మరో సినిమాకు ఓకే చెప్పింది. వివాహం తర్వాత కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ఇదే.

వివాహం తర్వాత కొత్త సినిమాకు ఓకే చెప్పిన టాలీవుడ్ చందమామ.. ప్రభుదేవాతో జోడికట్టనున్న ముద్దుగుమ్మ.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 23, 2020 | 3:37 PM

Kajal green signal to new movie: ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. అనంతరం ‘చందమామ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న కాజల్ వరుస ఆఫర్లను దక్కించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది.. ఇటీవల ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత కాజల్ సినిమాలను చేసే అవకాశాలు లేవని అప్పట్లో వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కాజల్ అగర్వాల్ కొత్త చిత్రానికి ఓకే చెప్పింది. ప్రస్తుతం మోసగాళ్లు, ఆచార్య, భారతీయుడు2, ముంబై సగా, పారిస్ పారిస్ వంటి బహు భాష చిత్రాల్లో బిజీగా నటిస్తోన్న కాజల్ కొత్తగా మరో సినిమాకు ఓకే చెప్పింది. వివాహం తర్వాత కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా ఇదే. డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ హారర్ కామెడీ చిత్రంలో కాజల్ నటించనుంది. తమిళంలో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోరో లేదో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా ప్రభుదేవా నటించనున్నాడు. కాజల్, ప్రభుదేవా ఇద్దరు కలిసి ఇది వరకు పలు స్టేజ్‌లపైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కాజల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. పెళ్లికి ముందు మంచి విజయాలతో దూసుకెళ్లిన కాజల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.