రాముడు నడయాడిన భద్రాచలంకు బీజేపీ ఏం చేసింది..? కేసీఆర్ కంటే నిజమైన హిందువు దేశంలో ఎవరూ లేరు : టీఆర్ఎస్ నేతలు

రాముడు నడయాడిన భద్రాచలంకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు టీఆర్ఎస్ నేత, ఎంపీ కే కేశవరావు . కేసీఆర్ కంటే నిజమైన హిందువు దేశంలో ఎవరూ లేరని ఆయన చెప్పారు. దేవుడిని నమ్మనంత మాత్రాన హిందువు కాకుండా పోరని ఆయన చెప్పుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన వారికి డబ్బులు పంచడం పాపమా..? అని ప్రశ్నించిన ఆయన, కేసీఆర్ తీసుకొచ్చే ప్రతి పథకంలో సామాజిక కోణం ఉంటుందని తెలిపారు. 10 వేల పంపిణీని అడ్డుకుంటుంది బీజేపీ, కాంగ్రెస్సే నని […]

రాముడు నడయాడిన భద్రాచలంకు బీజేపీ ఏం చేసింది..? కేసీఆర్ కంటే నిజమైన హిందువు దేశంలో ఎవరూ లేరు : టీఆర్ఎస్ నేతలు

రాముడు నడయాడిన భద్రాచలంకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు టీఆర్ఎస్ నేత, ఎంపీ కే కేశవరావు . కేసీఆర్ కంటే నిజమైన హిందువు దేశంలో ఎవరూ లేరని ఆయన చెప్పారు. దేవుడిని నమ్మనంత మాత్రాన హిందువు కాకుండా పోరని ఆయన చెప్పుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన వారికి డబ్బులు పంచడం పాపమా..? అని ప్రశ్నించిన ఆయన, కేసీఆర్ తీసుకొచ్చే ప్రతి పథకంలో సామాజిక కోణం ఉంటుందని తెలిపారు. 10 వేల పంపిణీని అడ్డుకుంటుంది బీజేపీ, కాంగ్రెస్సే నని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. బండి సంజయ్ కేంద్రం నుంచి ఎందుకు రూపాయి తేలేకపోయారు..? అని ప్రశ్నించిన ఈశ్వర్, హైదరాబాద్‌లో అశాంతి కలిగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని కొప్పుల విమర్శించారు. రాజకీయాల్లో నిబద్ధత లేని వ్యక్తి ఎంపీ అరవింద్ అని వ్యాఖ్యానించారు.