అసలేం జరుగుతోంది… నా విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు..

ఐపీఎల్-13 సీజన్​లో గాయపడ్డ ముంబై ఇండియన్స్ సారథి, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌ శర్మ ప్లే ఆఫ్స్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు​ సిరీస్​ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు.

  • Sanjay Kasula
  • Publish Date - 6:51 pm, Sat, 21 November 20
అసలేం జరుగుతోంది... నా విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు..

ఐపీఎల్-13 సీజన్​లో గాయపడ్డ ముంబై ఇండియన్స్ సారథి, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌ శర్మ ప్లే ఆఫ్స్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు​ సిరీస్​ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏలో శిక్షణా తీసుకుంటున్నాడు.

టీమిండియా అభిమానులతోపాటు మాజీ, సహ క్రికెటర్ల చాలా ప్రశ్నలు గుప్పించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఓ నిర్ణయానికి వచ్చేసి పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్.. వీటన్నింటికి ఒక్కమాటలో సమాధానమిచ్చాడు.

అసలేం జరుగుతుందనే విషయంపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. అయితే, నేనొక విషయం చెప్పదల్చుకున్నాను. నేను నిరంతరం బీసీసీఐ, మంబై ఇండియన్స్‌తో చర్చలు జరుపుతున్నాను. లీగ్‌ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా జట్టుకు చెప్పాను. ఇప్పుడు తొడ కండరాల గాయం నుంచి కోలుకున్నాను. అలాగే టెస్టు సిరీస్‌ ఆడకముందే పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే ఏ విషయంలోనూ నన్ను వేలెత్తి చూపొద్దని అనుకుంటున్నాను. తన గాయం మరీ పెద్దదేమీ కాదని, ఆసీస్ టూర్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయితే, నా విషయంలో ఎందుకింత దుమారం రేగిందో అర్థం కావడం లేదు అని ఆందోళన వ్యక్తం చేశాడు హిట్ మ్యాన్ రోహిత్​ శర్మ.