తండ్రి అంత్యక్రియలు హాజరుకాలేని స్థితిలో సిరాజ్, ధైర్యం చెప్పిన గంగూలీ

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ ఆసిస్ పర్యటనలో ఉండగా..‌ అతడి తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం మృతి చెందారు.

  • Ram Naramaneni
  • Publish Date - 6:55 pm, Sat, 21 November 20
తండ్రి అంత్యక్రియలు హాజరుకాలేని స్థితిలో సిరాజ్,  ధైర్యం చెప్పిన గంగూలీ

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌ ఆసిస్ పర్యటనలో ఉండగా..‌ అతడి తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ గౌస్.. అదే సమస్యతో కన్నుమూశారు. తన తండ్రి చనిపోయాడని తెలిసినా భారత్‌కు తిరిగి రాకుండా, ఆస్ట్రేలియాలో టీమ్‌తోనే ఉండాలని అతడు నిర్ణయం తీసుకున్నాడు.

ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్‌పై బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు.  టీమ్‌తోనే ఉండాలని అతడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతడు విజయం సాధించాలని కోరుతూ శనివారం ఓ ట్వీట్ చేశాడు.  సిరాజ్ స్టార్ క్రికెటర్ కాకముందు 53 ఏళ్ల అతడి తండ్రి ఆటో నడిపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. సిరాజ్ భారత్  తరఫున వన్డేలు, టీ20లు ఆడినా.. వన్డేల్లో ఇంకా వికెట్ల బోణీ చేయలేదు.