గ్రేటర్ పరిధిలో చురుకుగా ఎన్నికల ఏర్పాట్లు.. పోలింగ్ స్టేషన్ల వివరాల ప్రకటన.. మొత్తం పోలింగ్ కేంద్రాలు ఎన్నంటే..!
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వివరాలను శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల వివరాలను శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 29 ప్రకారం వార్డులకు నియమించబడిన రిటర్నింగ్ అధికారులు ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వాటిని జీహెచ్ఎంసీ కమీషనర్ మరియు ఎన్నికల అధికారి ఆమోదం మేరకు ప్రకటించారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 150 వార్డులకు గానూ వార్డులవారిగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి ప్రకటించారు.
గ్రేటర్ లో పోలింగ్ స్టేషన్ల వివరాలుః
* మొత్తం పోలింగ్ కేంద్రాలు 9101
* అత్యధికంగా కొండాపూర్ డివిజన్ లో 99 పోలింగ్ కేంద్రాలు
* అతితక్కువగా ఆర్.సి పురం డివిజన్ లో 33 పోలింగ్ కేంద్రాలు
జీహెచ్ఎంసీ సర్కిల్, వార్డుల వారిగా పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలాః