AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలు కోల్పోయిన చిన్నారి కేసు: భారీ పరిహారం ఇవ్వాలని TGSRTCకి ట్రైబ్యునల్ ఆదేశం

TGSRTC Compensation Case: 2020 ఆగస్టు 4న తల్లిదండ్రులతో కలిసి బొగారం నుంచి నెలపట్ల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రామన్నపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతతో బస్సు ముందుచక్రం చిన్నారి కుడికాలిపై వెళ్లింది. ఈ ప్రమాదం కారణంగా చిన్నారి కాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారించిన ట్రైబ్యునల్.. చిన్నారి కుటుంబానికి భారీ పరిహారం ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీని ఆదేశించింది.

కాలు కోల్పోయిన చిన్నారి కేసు: భారీ పరిహారం ఇవ్వాలని TGSRTCకి ట్రైబ్యునల్ ఆదేశం
Tgsrtc
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 11:17 PM

Share

నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో చిన్నారి జీవితంలో చోటుచేసుకున్న విషాద ఘటనకు కోర్టు న్యాయం చేసింది. కాలు కోల్పోయిన బాలికకు తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (TGSRTC) రూ.24,86,105 పరిహారం చెల్లించాలని నగర సివిల్‌ కోర్టుకు చెందిన మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించింది. కేసు దాఖలు చేసిన తేదీ నుంచి పూర్తి చెల్లింపు వరకు సంవత్సరానికి 9 శాతం వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. సైదాబాద్‌కు చెందిన హర్షిత ప్రమాదం జరిగినప్పుడు కేవలం ఆరేళ్ల చిన్నారి. 2020 ఆగస్టు 4న తల్లిదండ్రులతో కలిసి బొగారం నుంచి నెలపట్ల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రామన్నపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతతో బస్సు ముందుచక్రం చిన్నారి కుడికాలిపై వెళ్లింది. తీవ్ర గాయాల కారణంగా వైద్యులు మోకాలి కింద భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఈ ఘటనపై రామన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, విచారణలో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలింది. డ్రైవర్ కూడా తన తప్పును అంగీకరించినట్లు సమాచారం. బాలిక తండ్రి మల్లయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన ట్రైబ్యునల్‌.. చిన్నారి భవిష్యత్తు, శారీరక నష్టం, వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఈ పరిహారం ప్రకటించింది. ఒక నిర్లక్ష్యం చిన్నారి జీవితాన్ని పూర్తిగా మార్చేసినా.. కోర్టు తీర్పు ఆమె భవిష్యత్తుకు కొంతమేర భరోసా ఇచ్చేలా నిలిచింది.

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి