Traffic Violation: సామాన్యుడి ట్వీట్‌తో.. పోలీస్ వాహనానికే..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రాఫిక్ చలానా వేస్తే వాహనదారులు అగ్గిమీద గుగ్గిళం అవతున్నారు. ఫైన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. కానీ ఇక్కడ సీన్ కాస్త రివర్స్. సామాన్యుడు చేసిన ఓ ట్వీట్‌తో ఏకంగా పోలీస్ వాహనానికే ట్రాఫిక్ చలానా విధించారు...

Traffic Violation: సామాన్యుడి ట్వీట్‌తో.. పోలీస్ వాహనానికే..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2020 | 6:13 AM

Traffic Violation Rules: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రాఫిక్ చలానా వేస్తే వాహనదారులు అగ్గిమీద గుగ్గిళం అవతున్నారు. ఫైన్స్ ఆ రేంజ్‌లో ఉన్నాయి మరి. కానీ ఇక్కడ సీన్ కాస్త రివర్స్. సామాన్యుడు చేసిన ఓ ట్వీట్‌తో ఏకంగా పోలీస్ వాహనానికే ట్రాఫిక్ చలానా విధించారు. అయితే ఫైన్ తక్కువేనండీ.. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం మరి..

Also Read: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..

సైదాబాద్‌ టి- జంక్షన్‌ వద్ద పోలీస్ వాహనాన్ని అడ్డంగా నిలిపారంటూ కమిషనర్‌కు ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్‌ను పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విభాగానికి ఫార్వార్డ్ చేశారు. దీనితో మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనానికి చలానా విధించారు. రహదారిపై అడ్డంగా నిలిపేసినందుకు రూ.135 జరిమానా పడింది.