Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Quaden Bayles: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..

ఒకరిని ఒకరు ఎగతాళి చేస్తూ మాట్లాడుకోవడానికి లిమిట్ అంటూ ఉంటుంది. 9 ఏళ్ళ చిన్నారి మనసును గాయపరుస్తూ తోటి విద్యార్థులు ఎగతాళి చేయడమే కాకుండా సూటిపోటి మాటలతో తీవ్ర ఆవేదనకు గురి చేశారు. దీనితో ఆ పసి ప్రాణం 'అమ్మా.. నాకు త్రాడు ఇవ్వు.. చచ్చిపోతానంటూ..

Quaden Bayles: నన్ను చంపేయ్ అమ్మా.. 9 ఏళ్ళ చిన్నారి ఆవేదన.. వీడియో వైరల్..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2020 | 8:15 AM

Quaden Bayles Video Viral:ఒకరిని ఒకరు ఎగతాళి చేస్తూ మాట్లాడుకోవడానికి లిమిట్ అంటూ ఉంటుంది. ఒకవేళ ఆ పరిధి దాటితే మాత్రం అందరూ సహనం కోల్పోతారు. పెద్దవాళ్లు అయితే తిరగబడతారు గానీ.. చిన్న పిల్లలు ఏమి చేయగలరు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. 9 ఏళ్ళ చిన్నారి మనసును గాయపరుస్తూ తోటి విద్యార్థులు ఎగతాళి చేయడమే కాకుండా సూటిపోటి మాటలతో తీవ్ర ఆవేదనకు గురి చేశారు. దీనితో ఆ పసి ప్రాణం ‘అమ్మా.. నాకు త్రాడు ఇవ్వు.. చచ్చిపోతానంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా అందరి మనసులను కలిచి వేస్తోంది.

Also Read: సామాన్యుడి ట్వీట్‌తో.. పోలీస్ వాహనానికే..

ఆస్ట్రేలియాలోని బ్రేస్బెన్ ప్రాంతానికి చెందిన ఖ్వాడెన్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి చిన్నప్పటి నుంచి జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నాడు. దాని వల్ల అతడు ఏజ్‌కు తగ్గట్టు ఉండాల్సిన ఎత్తులో లేదు.. మరగుజ్జుగానే ఉండిపోయాడు. దేవుడు ఇచ్చిన ఈ లోపాన్ని ఆ పసి ప్రాణం ఏమి చేయగలడు. కానీ తోటి విద్యార్థులు మాత్రం ఆ లోపాన్ని ఎత్తి చూపుతూ అతడిని హేళన చేయడం మొదలు పెట్టారు. మనసు విరిగిపోయేలా మాటలు మాట్లాడారు. ఇంకేముంది స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి వచ్చిన తల్లి యారకా బేల్స్ చెంతకు చేరిపోయి భావోద్వేగానికి గురయ్యాడు.

కారులో కూర్చుని ఏడుస్తూ.. ‘అమ్మా.. నేను బ్రతకను.. నాకు ఒక త్రాడు ఇవ్వు.. చచ్చిపోతా’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. కనీసం కత్తి అయినా ఇవ్వు అమ్మా గుండెల్లో పొడుచుకుని చనిపోతా.. లేదా నన్ను చంపేయండి అంటూ రోదించాడు. ఇక తన కొడుకు బాధను ఆ తల్లి ఏడుస్తూ వీడియో తీయడమే కాకుండా స్కూల్‌లో తోటి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి అని చెబుతూ వాళ్ల తల్లిదండ్రుల పెంపకం ఇదేనా అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయింది. నెటిజన్లు అది చూసి చలించిపోయారు. ఆ చిన్నారిని ఓదారుస్తూ.. ‘ప్రపంచంలోని అందరూ కూడా నీకు తోడుగా ఉంటారంటూ’ ధైర్యం చెబుతూ కామెంట్స్ చేశారు. ఒక్కరేమిటి సినీ స్టార్ల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఆ పిల్లాడికి అండగా నిలిచారు. హాలీవుడ్ హీరో హ్యుజ్ జాక్‌మెన్ అయితే ఏకంగా డిస్నీ ల్యాండ్ సందర్శించడానికి ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చాడు.