‘దిశ’ పీఎస్ హోంగార్డు నిర్వాకం.. బాలిక గర్భం

మహిళలపై అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు. ఇందులో ముఖ్యంగా బాలికలు ఎక్కువగా అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ హోంగార్డు మైనర్‌ బాలికపై కన్నేసి..

'దిశ' పీఎస్ హోంగార్డు నిర్వాకం.. బాలిక గర్భం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 22, 2020 | 8:59 PM

అఘాయిత్యాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునే విధంగా.. ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి.. ‘దిశ’ పేరుతో పోలీస్‌ స్టేషన్‌లను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే స్పందించేందుకు ‘దిశ యాప్‌’ను తీసుకొచ్చింది. కేసు నమోదు చేసుకున్న నెలరోజుల్లోనే.. నిందితుడి చట్ట ప్రకారంగా శిక్షించే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.

అయితే ఇన్ని చట్టాలు వస్తున్నా.. మహిళలపై అత్యాచారాలు మాత్రం తగ్గడంలేదు. ఇందులో ముఖ్యంగా బాలికలు ఎక్కువగా అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఓ హోంగార్డు మైనర్‌ బాలికపై కన్నేసి.. రాసలీలలు నడిపాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో.. గుంటూరులోని చిలకలపూడి పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. నిందితుడు దిశ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే హోంగార్డ్ ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసి అటు ప్రజలు, ఇటు పోలీసులు ఇద్దరూ అవాక్కయ్యారు.