హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు

మహాన‌గ‌న‌రంలో గ‌ణేశ్ నిమజ్జనానికి రంగం సిద్ద‌మైంది. వివిధ రూపాల్లో పది రోజుల పాటు\ భక్తుల పూజలందుకున్న గ‌ణ‌నాథులు కొద్ది గంటల్లో బైబై చెప్ప‌నున్నారు.

హైదరాబాద్‌లో నేడు ట్రాపిక్‌ ఆంక్షలు : ఇవిగో వివ‌రాలు
Follow us

|

Updated on: Sep 01, 2020 | 8:06 AM

మహాన‌గ‌న‌రంలో గ‌ణేశ్ నిమజ్జనానికి రంగం సిద్ద‌మైంది. వివిధ రూపాల్లో పది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గ‌ణ‌నాథులు కొద్ది గంటల్లో బైబై చెప్ప‌నున్నారు. హైద‌రాబాద్ అన్ని వైపుల‌ నుంచి విగ్రహాలు బాలాపూర్‌ గణేష్‌తో కలిసి మెయిన్ రోడ్‌లో పయనించి హుస్సేన్‌ సాగర్‌లో మంగళవారం నిమజ్జనం కానున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ 21 క్రేన్లను సిద్ధం చేశారు అధికారులు. ఇక ఖైరతాబాద్‌ గణపతి ఊరేగింపు ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు వెల్ల‌డించారు.

వినాయ‌క ఊరేగింపు, నిమ‌జ్జ‌నం నేప‌థ్యంలో సిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు పోలీసులు. ఇవి మంగ‌ళ‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ అమల్లో ఉంటాయని ‌ తెలిపారు

  •  మెయిన్ రూట్స్‌లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ఏరియాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రాణించాలి.
  • నెక్లెస్‌రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లపై కేవ‌లం గ‌ణ‌నాథుడి నిమజ్జనానికి వచ్చే వాహనాలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఇస్తారు.
  • ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారు.. వచ్చేవారు.. ఓ.ఆర్‌.ఆర్ మీదుగా రాకపోకలు కొనసాగించడం మంచింది. ఇమ్లీబన్‌, జేబీఎస్‌లకు రాకపోకలు సాగించే జిల్లాల బస్సులు ఊరేగింపు లేని రూట్ల‌ను ఎంచుకోవాలి.

ప్రజలు, భక్తులు సమాచారం కోసం 040-2785 2482, 9010203626

Also Read :

ఆరు వారాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ !

నేడే జేఈఈ మెయిన్‌ పరీక్ష : నిబంధ‌న‌లు ఇవే