AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్10 న్యూస్ @10

1. కర్నాటకం.. క్లైమాక్స్ నేడే..! కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని లేఖ ద్వారా సూచించారు. అయితే అంతకుముందు విశ్వాస పరీక్షను నిన్ననే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్‌కు సందేశం పంపారు. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల ఆందోళన.. Read More 2. మున్సిపల్ చట్టం పై.. నేడు తెలంగాణ ఉభయసభల్లో చర్చ నేడు తెలంగాణ ఉభయసభల్లో నూతన మున్సిపల్ చట్టం పై […]

టాప్10 న్యూస్ @10
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 19, 2019 | 10:12 AM

Share

1. కర్నాటకం.. క్లైమాక్స్ నేడే..!

కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 నిమిషాల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని లేఖ ద్వారా సూచించారు. అయితే అంతకుముందు విశ్వాస పరీక్షను నిన్ననే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్‌కు సందేశం పంపారు. కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల ఆందోళన.. Read More

2. మున్సిపల్ చట్టం పై.. నేడు తెలంగాణ ఉభయసభల్లో చర్చ

నేడు తెలంగాణ ఉభయసభల్లో నూతన మున్సిపల్ చట్టం పై చర్చ జరపనున్నారు. ఆదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు శాసనమండలి ప్రారంభం కానుంది. కాగా నిన్న జరిగిన శాసనసభలో నూతన మున్సిపల్ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దాంతో పాటు వార్డుల విభజనకు సంబంధించి మున్సిపల్ నిబంధనల సవరణ.. Read More

3. జక్కన్న సినిమాలో వేషం..నిండా ముంచేశాడు పాపం

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందంటే ఎగరైనా సరే గంతేస్తారు. అంతెందుకు పెద్ద పెద్ద స్టార్ హీరోలే మీ సినిమాలో చిన్న వేషం ఇవ్వండి అని పబ్లిక్‌గా దర్శక ధీరుడుని అడిగిన.. Read More

4. అంతరిక్షంలో నాసా వ్యవసాయం : ఏం పడించబోతోందో తెలుసా..?

అంతరిక్షంపైన ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ ఆసక్తి ఎక్కువే. కాగా.. అంతరిక్షంలో నీరు.. ఉన్నాయని.. అక్కడ మానవులు నివసించవచ్చని ఇదివరకే నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలో గాలిపీల్చుకోవడమే కష్టం కాదా..! అలాంటిది.. అంతరిక్షంలో మొక్కల్ని పెంచడం కష్టమైన పనే.. దాదాపు అసాధ్యం.. Read More

5. జగన్ గారూ! ఈ పద్దతి కరెక్ట్ కాదు- పురందేశ్వరి

విశాఖపట్నంలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ పోలీస్ కమిషనర్ ఆదేశాలివ్వడం సరైన నిర్ణయం కాదన్నారు బీజేపీ సీనియర్ నేత పురందేశ్వరి. ఇలా ఒక మతాన్నో, ఒక కులాన్నో కావాలని ప్రోత్సహించేలా వ్యవహరించడం.. Read More

6. “అంకుల్ నెల్సన్.. నాకు ఆదర్శం” : ప్రియాంక ట్వీట్

“అంకుల్ నెల్సన్.. నాకు ఆదర్శం ఆయన నా గైడ్” అంటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఆయన గతంలోనే చెప్పనట్లు తాను గుర్తుచేసుకున్నారు. గురువారం దక్షిణాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా 101 జయంతి సందర్భంగా.. Read More

7. పేద విద్యార్థులకు అండగా.. కేటీఆర్ ఆర్థికసాయం

మెరిట్ స్టూడెంట్స్ అయిన పేద విద్యార్థులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. పేదరికం వల్ల ఉన్నత చదువులు చదివేందుకు ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన ఇద్దరు విద్యార్థినులకు నేనున్నానంటూ కేటీఆర్ అండగా నిలిచారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తాండ్రియాలకు చెందిన రుద్ర రచన తల్లిదండ్రులు .. Read More

8. కౌంటర్లో కూర్చోని టికెట్లు అమ్ముతున్న యువ హీరో..

ఏంటి షాక్ అవుతున్నారా..? అవునండీ.. హీరో సందీప్ కిషన్ నిజంగానే ఒక థియేటర్‌లో కూర్చోని టికెట్లు అమ్మాడు. తాజాగా.. విడుదలైన ‘నిను వీడని నీడని నేనే’ సినిమా మంచి టాక్‌నే తెచ్చుకుంది. అయినా.. మనోడు అక్కడితో ఆగిపోకుండా.. నాలుగు రోజులుగా ఊరూరా తిరుగుతూ సినిమా ప్రమోషన్స్‌లో.. Read More

9. ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల పోలీసులకు సుప్రీం షాక్ ఇచ్చింది. పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాతే కోర్టు దృష్టికి తీసుకురావాలని.. Read More

10. ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలకు సర్వం సిద్ధం..!

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. బోనాల జాతర కోసం నార్త్ జోన్ పోలీసులు అన్ని ఏర్పాట్లులు పూర్తి చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో.. Read More