టాప్ 10 బెస్ట్ మూవీస్ @ 2019
87 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కాగా.. మరెన్నో చిత్రాలు దారుణమైన డిజాస్టర్లుగా నిర్మాతలకు కోట్లలో లాస్ తెచ్చిపెట్టాయి. ప్రతి ఏడాది టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలన్నీ అన్ని కలిపితే దాదాపు 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటాయి. ఇక ఎప్పటిలానే ఈ 2019 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లు కాగా.. మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మరి ఇప్పటివరకు ప్రేక్షకులు బ్రహ్మరథం […]

87 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కాగా.. మరెన్నో చిత్రాలు దారుణమైన డిజాస్టర్లుగా నిర్మాతలకు కోట్లలో లాస్ తెచ్చిపెట్టాయి. ప్రతి ఏడాది టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలన్నీ అన్ని కలిపితే దాదాపు 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటాయి. ఇక ఎప్పటిలానే ఈ 2019 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లు కాగా.. మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మరి ఇప్పటివరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన మూవీస్ మీద మనం కూడా ఓ లుక్కేద్దాం.
- ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పెటా’, ‘వినయ విధేయ రామ’ వంటి బడా చిత్రాలు ఆ తరుణంలో విడుదలైనా.. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. అంతేకాక పండగకు ఈ మూవీ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
- జెర్సీ
నేచురల్ స్టార్ నాని, ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జెర్సీ ‘. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇది ‘వన్ అఫ్ ది బెస్ట్’ ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అర్జున్’ పాత్రలోకి నాని పరకాయ ప్రవేశం చేసి మరీ జీవించాడని.. ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న నానికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.
- ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. డిటెక్టీవ్, మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2019లో చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారింది.
- బ్రోచేవారెవరురా
క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథా పేతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రియదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
- మహర్షి
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. మహేష్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు. యాక్షన్, మెసేజ్, ఎమోషన్స్ ఒకటేమిటి ఇలా అన్ని కూడా ఈ మూవీలో సమపాళ్ళులో ఉన్నాయి. ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘మహర్షి’ మహేష్‌కు మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది.
- ఇస్మార్ట్ శంకర్
‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా విడుదల కాకముందు దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో రామ్ పోతినేని వరుస ప్లాప్స్‌తో సతమతమయ్యారు. అయితే ఈ మూవీ రిలీజైన మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఇద్దరి కెరీర్లకు మంచి కిక్కు ఇచ్చింది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా 2019లో ది బెస్ట్‌గా నిలిచింది.
- మజిలీ
అక్కినేని నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కుటుంబ కథలను రూపొందించడంలో శివ దిట్ట. అతడి గత చిత్రం ‘నిన్ను కోరి’ మాదిరిగానే ఈ మూవీకు కూడా ప్రేక్షకులు నుంచి విశేషదారణ లభించింది.
- చిత్రలహరి
సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మంచి సోషల్ మెసేజ్‌తో అద్భుతమైన డైలుగులతో కూడిన ఈ మూవీ యువతను ఆకట్టుకుంది. 2019లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి.
- ఓ బేబి
‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘ఓ బేబి’ చిత్రంలో సమంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషించారు. దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా సమంతా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
- సైరా నరసింహా రెడ్డి
తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చాన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్ర రెడ్డి వహించారు, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.




