Director Sukumar: సొంత ఊరిలో ఆక్సీజన్ ప్లాంట్ నిర్మాణనికి శ్రీకారం చుట్టిన స్టార్ డైరెక్టర్..
కరోనా మహమ్మారితో జనాలందరూ సతమతమవుతున్నారు. ఊపిరి ఆడకపోవడంతో ఉసూరు మంటూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

director Sukumar: కరోనా మహమ్మారితో జనాలందరూ సతమతమవుతున్నారు. ఊపిరి ఆడకపోవడంతో ఉసూరు మంటూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో కొంత మంది సెలబ్రిటీలు ఆక్సీజన్ కిట్లను… ఆసుపత్రుల్లో బెడ్లను అందిస్తూ చాతనైనంత సాయం చేస్తున్నారు. అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా తన జిల్లా ప్రజల కోసం ఇలాంటి ఓ మంచి పనినే తలపెట్టారు. ఈ నేపథ్యంలో రూ.25 లక్షలు ఖర్చు చేసి కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సుకుమార్. సుకుమార్ పుట్టి పెరిగిన తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తన వంతు సాయంగా ఆక్సీజన్ ప్లాంట్ నిర్మాణనికి శ్రీకారం చుట్టారు సుకుమార్. 25 లక్షలతో అందరికీ ఆక్సిజన్ అందించేలా ఈ ప్లాంట్ను ఏర్పాటును చేయదలచారు. అందులో భాగంగా ఇటీవల జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపారు.
ఇక మొదటి విడతగా 40 లీటర్ల ఆక్సిజన్ సిలండర్లను అమలాపురంలో ఉన్న ఆజాద్ ఫౌండేషన్ కు తన స్నేహితుడు రాంబాబు ద్వారా సుకుమార్ ఇప్పించారు. ఈ సందర్భంగా సుకుమార్ మిత్రుడు రాంబాబు మాట్లాడుతూ.. త్వరలోనే కోనసీమలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సుకుమార్ ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడే కాదు కరోనా మొదటి వేవ్‌లోనూ తన గ్రామంలోని ఇంటింటికి 1000 రూపాయలను పంపిణీ చేసి అందరిని ఆదుకున్నారు సుకుమార్.
మరిన్ని ఇక్కడ చదవండి :




