AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. ‘పెళ్లి సందడి’ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ఎంతోమంది ప్ర‌ముఖులు ఈ వ్యాధి బారిన పడి......

Tollywood: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం.. 'పెళ్లి సందడి' సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత
Cinematographer Jayarm
Ram Naramaneni
|

Updated on: May 21, 2021 | 8:39 AM

Share

క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు ఎంతోమంది ప్ర‌ముఖులు ఈ వ్యాధి బారిన పడి క‌న్నుమూశారు. అందులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారు కూడా చాలామంది ఉన్నారు. తెలుగు ప‌రిశ్ర‌మలో కూడా క‌రోనా ఎన్నో విషాదాలు నింపుతోంది. తాజాగా మే 21 తెల్లవారు జామున సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కోవిడ్ కార‌ణంగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. చికిత్స తీసుకుంటూనే.. ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస విడిచారు.

తెలుగులో విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ‌ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాల‌కు అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి బ‌డా హీరోల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి.. త‌న ప‌నిత‌నం చూపించారు జయరాం. ఇటు తెలుగు, అటు మలయాళం సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా స‌త్తా చాటి… ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక చిత్రాల‌కు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేశారు. బ్లాక్ బాస్ట‌ర్ ‘పెళ్లి సందడి’ చిత్రానికి కూడా ఆయ‌నే సినిమాటోగ్రాఫర్‌. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బుచ్చిబాబు.. యంగ్ టైగర్ తో సినిమా చేయనున్న ఉప్పెన డైరెక్టర్…

కరోనాతో మృతిచెందిన కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం..

Follow Us
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..