Buchi Babu Sana: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బుచ్చిబాబు.. యంగ్ టైగర్ తో సినిమా చేయనున్న ఉప్పెన డైరెక్టర్…

ఈ ఏడాది విడుదలైన సినిమాలన్నింటిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఉప్పెన. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాను బుచ్చిబాబు..

Buchi Babu Sana: బంపర్ ఆఫర్ దక్కించుకున్న బుచ్చిబాబు.. యంగ్ టైగర్ తో సినిమా చేయనున్న ఉప్పెన డైరెక్టర్...
Follow us
Rajeev Rayala

|

Updated on: May 21, 2021 | 8:12 AM

Buchi Babu Sana: ఈ ఏడాది విడుదలైన సినిమాలన్నింటిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ఉప్పెన. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాను బుచ్చిబాబు సాన తెరకెక్కించారు. సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు ఉప్పెన సినిమాను ఓ అందమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విజయం తోపాటు వసూళ్లను కూడా బాగానే రాబట్టింది. అలాగే మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కెట్ లోకి అడుగు పెట్టాడు వైష్ణవ్ తేజ్. అందాల కృతిశెట్టి కూడా ఈ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమాతర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేస్తాడు అనుకుంటుంటే ఏకంగా స్టార్ హీరోతో సినిమాను లైన్ లో పెట్టేసాడు బుచ్చిబాబు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే తారక్ కు ఓ కథ వినిపించారని.. లైన్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడిచింది.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ కి శుభాకాంక్షలు తెలియజేసిన బుచ్చిబాబు, ఆయనతో చేయనున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పాడు. ‘లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పి ఒక ట్రెండ్ సృష్టిద్దాం సార్’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఖచ్చితంగా ఉంటుందని అర్థం అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

మా ఇంట్లో 10 మందికి కరోనా వచ్చింది.. మానసికంగా.. శారీరకంగా కష్టాలు.. రవితేజ హీరోయిన్ ఎమోషనల్ ..

లాక్‏ డౌన్‏లో రహస్యంగా బిగ్‏బాస్ షో షూటింగ్.. 8 మంది సిబ్బందికి కరోనా… పోలీసుల రాకతో ట్విస్ట్..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సింగర్ అర్జిత్ సింగ్ తల్లి మృతి.. సాయం కోసం అభ్యర్థించిన ఫలితం లేదు..