నా విజయానికి ‘అదృష్టం’ ఒక్కటే కారణం కాదు

నా విజయానికి అదృష్టం ఒకటే కారణం కాదని చెబుతోంది టాలీవుడ్ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్. అదృష్టం వల్లనే నేను స్టార్‌డమ్, గుర్తింపు తెచ్చుకున్నానని ఎవరైనా అంటే ఒప్పుకోనని అంటోంది కాజల్. తన అందంతో కుర్రకారు మనసును దోచి...

నా విజయానికి 'అదృష్టం' ఒక్కటే కారణం కాదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 24, 2020 | 1:58 PM

నా విజయానికి అదృష్టం ఒకటే కారణం కాదని చెబుతోంది టాలీవుడ్ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్. అదృష్టం వల్లనే నేను స్టార్‌డమ్, గుర్తింపు తెచ్చుకున్నానని ఎవరైనా అంటే ఒప్పుకోనని అంటోంది కాజల్. తన అందంతో కుర్రకారు మనసును దోచి.. నటనతో ప్రేక్షకులను మెప్పించిన కాజల్.. ఇలీవలే ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

కృషి, దీక్ష పట్టుదల లేకుండా వచ్చిన ఏ విజయమైనా ఆత్మ సంత‌ృప్తిని కలిగించదు. అందుకే ఎవరైనా అదృష్టం ఒక్కటే విజయానికి మార్గం అని చెబితే నమ్మొద్దు. నా జీవితంలో ఆ పదానికి చోటు ఉండొచ్చు కానీ, నా స్టార్‌డమ్‌కు అద‌ృష్టం కారణమంటే అసలు ఒప్పుకోను. సినిమాల్లో అవకాశాలు రావడం అదృష్టమని భావించవచ్చేమో కానీ.. ఆ తర్వాత నేను ఎదిగిన క్రమం అంతా నా కష్టమే.

అలాగే నటిగా నేను ఎంచుకున్న పాత్రలు, వాటికి న్యాయం చేయడానికి పడిన కష్టమే నన్ను ప్రేక్షుకుల మందిలో నిలబెట్టాయి. అలాగే పరాజయం వస్తే నేను ఎవరినీ బాధ్యుల్ని చేయను. పొరపాటు ఎక్కడ జరిగిందోనని ఆత్మ విమర్శ చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చింది కాజల్. కాగా ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న భారతీయుడు-2లో ప్రస్తుతం నటిస్తోంది. శంకర్ దీనికి దర్మకత్వం వహిస్తున్నారు.

Read More:

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు