AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెల్ని పిండేసే విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

జనగామ జిల్లా కేంద్రంలో అత్యంత దారుణమైన, మనసును కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణ వార్త విని, ఆ తట్టుకోలేని బాధతో నాయనమ్మ కూడా ప్రాణాలు విడవడం స్థానికులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది.

గుండెల్ని పిండేసే విషాదం.. నీటి సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
Jangoan News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 24, 2026 | 7:45 PM

Share

జనగామ జిల్లా కేంద్రంలో అత్యంత దారుణమైన, మనసును కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణించడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణ వార్త విని, ఆ తట్టుకోలేని బాధతో నాయనమ్మ కూడా ప్రాణాలు విడవడం స్థానికులను తీవ్రంగా చలించిపోయేలా చేసింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో అందరూ పనుల్లో ఉండగా, కేవలం ఒక సంవత్సరం ఆరు నెలల వయసున్న చిన్నారి ఆడుకుంటూ బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న నీటి సంపులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని బయటకు తీసేలోపే, ఆ బాలుడు నీట మునిగి శ్వాస ఆడక ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి శవమై కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్నారి ఇక లేడనే చేదు నిజం ఆ కుటుంబంలో పెద్ద దిక్కైన నాయనమ్మ మారబోయిన నాగమ్మ (65)ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మనవరాలి మృతదేహాన్ని చూసి తట్టుకోలేక ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. ఆ తీవ్రమైన దుఃఖం, మానసిక ఆందోళన కారణంగా నాగమ్మకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. మనవరాలు మరణించిన కొద్దిసేపటికే నాగమ్మ కూడా కన్నుమూసింది.

ఒకే కుటుంబానికి చెందిన ఏడాదిన్నర చిన్నారితో పాటు, వృద్ధురాలైన నాయనమ్మ కూడా మృతి చెందడంతో అంబేద్కర్ నగర్ అంతా కన్నీరుమున్నీరవుతోంది. సమాచారం అందుకున్న జనగామ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us