AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Habits: మీ అలవాట్లే మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి! ఇవి పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం తథ్యం..

జీవన శైలి కారణంగా మనిషిని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. మానసిక రుగ్మతలు వేధిస్తున్నాయి. అయితే కొన్ని ఆరోగ్యకర అలవాట్లతో మీ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

Healthy Habits: మీ అలవాట్లే మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి! ఇవి పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం తథ్యం..
Healthy Habits
Madhu
|

Updated on: Mar 21, 2023 | 3:36 PM

Share

ప్రజల జీవన విధానాల్లో చాలా తేడాలొచ్చాయి. పాత కాలపు రోజుల్లా పరిస్థితులు లేవు. రోజూ ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. పైగా ఎక్కువ శాతం మంది శారీరక శ్రమలేని ఉద్యోగాలు చేస్తున్నారు. విపరీతమైన పని ఒత్తిడి.. వెరసి అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. మానసిక రుగ్మతలు వేధిస్తున్నాయి. అయితే కొన్ని ఆరోగ్యకర అలవాట్లతో మీ శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

వేకువనే నిద్రలేవాలి.. ఉదయాన్నే నిద్ర మేల్కోనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరం ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ధ్యానం, వ్యాయామం వంటివి చేయడానికి తగినంత సమయం దొరకుతుంది. దీని వల్ల రోజంతా యాక్టివ్ ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది.

వ్యాయామం.. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. ఇది చెమట ద్వారా శరీరం నుంచి అన్ని టాక్సిన్స్ తొలగించడానికి మీకు సహాయపడుతుంది. ఇది మీ రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మీ చర్మం, జుట్టుకు కూడా వ్యాయామం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

రుచికరమైన అల్పాహారం.. చాలా మంది బరువు తగ్గడానికి అల్పాహారం మానేయాలని నమ్ముతారు. అయితే, అల్పాహారం మానేయడం వల్ల మీకు మరింత ఆకలిగా అనిపిస్తుంది. అప్పుడు మీరు మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. అందుకే రుచికరమైన అల్పాహారం తగుమోతాదులో తీసుకుంటే మంచిది.

హైడ్రేటెడ్ గా ఉండండి.. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. మీ కణాల సరైన పనితీరుకు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం.

టైం టేబుల్.. మీరు చేయవలసిన పనుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. మీ రోజువారీ లక్ష్యాలను సెట్ చేసుకోవాలి. ఇది ఒత్తిడిని కలిగించే చివరి క్షణం వరకూ కాకుండా ముందే ఆ పనులను చేసేలా ప్రోత్సహిస్తుంది.

గ్రీన్ టీ తాగండి.. ఆరోగ్యకరమైన శరీరం కోసం, మీరు గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

చురుకుగా ఉండండి.. లిఫ్ట్‌కి బదులుగా మెట్లు ఎక్కడం మీ శరీరాన్ని ఫిట్‌గా, చురుకుగా ఉంచుతుంది. మీరు వారాంతాల్లో మీ స్నేహితులతో ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు.

బయటి ఫుడ్ వద్దు.. ఇంట్లో తయారుచేసిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. బయటి జంక్ ఫుడ్ కి వీలైనంత వరకూ దూరంగా ఉండండి.

మంచి నిద్ర.. ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి మంచి రాత్రి నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్ బాడీ, మైండ్‌ని కలిగి ఉండటానికి, రాత్రి ఆలస్యంగా పడుకునే అలవాటును వదిలివేయండి. త్వరగా పడుకోండి, త్వరగా లేవండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..