కరోనా విజృంభణ.. తిరుపతిలో లాక్‌డౌన్ పొడిగింపు..
ఏపీలోని చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు..
Tirupati Lockdown: ఏపీలోని చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా తిరుపతిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు నగరపాలిక సంస్థ కమిషనర్ గిరీశ ఆదేశాలు జారీ చేశారు. అయితే లాక్ డౌన్ ఆంక్షల్లో అధికారులు కొన్ని సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చునని కమిషనర్ స్పష్టం చేశారు.
కాగా, చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 22,478 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 225 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. అటు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 80 వేలు దాటింది. ఇందులో 88,138 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,91,117 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 2,562కి చేరుకుంది.
Also Read:
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని..
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..