Breaking: కరోనాతో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ మృతి..
ఉత్తరప్రదేశ్ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ తుది శ్వాస విడిచారు. గత నెలలో కరోనాతో లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చేతన్ కు..
Former Indian cricketer Chetan Chauhan dies: ఉత్తరప్రదేశ్ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ తుది శ్వాస విడిచారు. గత నెలలో కరోనాతో లక్నోలోని సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చేతన్ కు.. బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఇక తాజాగా ఆయన ఇవాళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా టీమిండియా తరఫున 1970ల్లో పలు టెస్ట్‌లు, వన్డేల్లో ఆడిన చేతన్ చౌహాన్.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Also Read:
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని..
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..