ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు.. బస్సుల్లో వైఎస్సార్ జనతా బజార్లు
ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీలో కిలో మీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి వైఎస్సార్ జనతా బజార్లుగా..
ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీలో కిలో మీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి వైఎస్సార్ జనతా బజార్లుగా మార్చనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చనున్నారు. వీటిని ఆర్జీసీలో ఇంజనీరింగ్ అధికారులు రూపొందించనున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆర్టీసీ మొబైల్ రైతు బజార్లను నగరాలు పట్టణాల్లో తిప్పింది. కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మొబైల్ బస్సులను తిప్పడంతో మంచి ఆదరణ లభించింది.
ఈ ప్రయోగానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. నాన్ టికెట్ రెవెన్యూ కింద ఆర్టీసీ శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్ రైతు బజార్లు బస్సులను తిప్పేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. కరోనా వ్యాప్తి రైతు బజార్లలో, మార్కెట్లలో ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను మొబైల్ రైతు బజార్లుగా మార్చి వినియోగదారుల వద్దకే సరుకులు తీసుకెళ్లనున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ ఉదంతంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Read More:
ఐదు రూపాయల డాక్టర్ మృతి.. సీఎం సంతాపం