శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల అష్టకష్టాలు

శ్రీవారి దర్శనం కోసం భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. చలిలో వణుకుతూ రాత్రి నుంచి రోడ్ల మీదే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వ దర్శనం టికెట్ల కోసం భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ దగ్గరికి భారీగా తరలివచ్చారు. అయితే రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను రాత్రే జారీ చేశారు టీటీడీ అధికారులు. దీంతో ఇవాళ శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు అలిపిరి దగ్గరే పడిగాపులు పడుతున్నారు. పిల్లాపాపలతో వచ్చిన వారి పరిస్థితి మరింత […]

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల అష్టకష్టాలు
Follow us

|

Updated on: Oct 31, 2020 | 11:03 AM

శ్రీవారి దర్శనం కోసం భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. చలిలో వణుకుతూ రాత్రి నుంచి రోడ్ల మీదే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వ దర్శనం టికెట్ల కోసం భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ దగ్గరికి భారీగా తరలివచ్చారు. అయితే రద్దీ దృష్ట్యా తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను రాత్రే జారీ చేశారు టీటీడీ అధికారులు. దీంతో ఇవాళ శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు అలిపిరి దగ్గరే పడిగాపులు పడుతున్నారు. పిల్లాపాపలతో వచ్చిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇవాళ ఇవ్వాల్సిన టోకెన్ల కోటా రాత్రే జారీ చేయడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి సర్వదర్శనం టోకెన్లు ఎప్పుడు జారీ చేస్తారో అర్థం కావడం లేదంటున్నారు. సర్వదర్శనం కోటా పూర్తి కావడంతో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్దకు భక్తులను అనుమతించకుండా రోడ్డుపైనే ఆపేస్తున్నారు సిబ్బంది. సర్వ దర్శనం టోకెన్లు జారీపై టీటీడీ స్పష్టత ఇవ్వడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కావాలంటే రాత్రి 12 గంటలకు ఇస్తామని చెబుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి టోకెన్లు రాత్రే జారీ చేయడం వల్ల తమకు శ్రీవారి దర్శనం ఒకరోజు ఆలస్యమవుతోందంటున్నారు. అప్పటి వరకు పడిగాపులు తప్పవా అని ప్రశ్నిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు.. ఎక్కడికి వెళ్లాలో.. ఎక్కడ ఉండాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.