రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

రేపటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుప‌తిలోని మూడు ప్రాంతాల‌లో గ‌ల 12  కౌంట‌ర్ల‌ల‌లో ప్ర‌తి రోజు 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు. 

  • Ravi Kiran
  • Publish Date - 8:16 am, Tue, 9 June 20
రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ...

రేపటి నుంచి తిరుపతిలో శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. తిరుప‌తిలోని మూడు ప్రాంతాల‌లో గ‌ల 12  కౌంట‌ర్ల‌ల‌లో ప్ర‌తి రోజు 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు మంజూరు చేయ‌నున్నారు. తిరుప‌తిలోని ఆర్టీసీ బ‌స్టాండ్‌, విష్టునివాసం, అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్‌ల‌లో బుధ‌‌వారం ఉద‌యం 5.00 గంట‌ల నుండి ద‌ర్శ‌నం టోకెన్లు ఇవ్వ‌నున్నారు. ప్రతీ రోజూ 3 వేల ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.

ఇదిలా ఉంటే రేపు తిరుమలలోని స్థానికుల కోసం 6 వేల టోకెన్లు టీటీడీ జారీ చేయనుంది. దీని కోసం తిరుమల బస్టాండ్, కౌస్తుభం, రెస్ట్ హౌస్, సీఆర్వోలో 12 కౌంటర్లను ఏర్పాటు చేసింది. భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఒక్క‌రోజు ముందుగా తిరుప‌తిలో ద‌ర్శ‌నం టోకెన్లు పొందవచ్చునని తెలిపింది. కాగా, జూన్ 11 నుంచి సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిచ్చారు. ప్రతిరోజు ఏడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేయగా.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శనానికి అనుమతులు ఉన్నాయి.

Also Read: 

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..