Nellore District: నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకుంది. వెంకటాచలం మండలం చెముడుగుంటలో చెరువులో ఈతకు వెళ్లి ఆదివారం ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.

Nellore District: నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..
Crime News
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 15, 2021 | 10:24 AM

Nellore District:  నెల్లూరు జిల్లాలో విషాదం నెలకుంది. వెంకటాచలం మండలం చెముడుగుంటలో చెరువులో ఈతకు వెళ్లి ఆదివారం ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. చెరువుగట్టుపై బట్టలు చూసి వారు గల్లంతైనట్లు స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే అలర్టైన వెంకటాచలం పోలీసులు రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.

సోమవారం ఉదయంలోపు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఎస్‌.కె.అలీం(13), పి.సాయి(13), ఎం.రాజేశ్‌(13)గా గుర్తించారు. మృతులు బుజబుజనెల్లూరు వాసులుగా నిర్ధారించారు. మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read:

 విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కన్నీళ్లు.. ధర బాగా ఉన్న సమయంలో జెమిని వైరస్ అటాక్