road accident: న్యూ ఇయర్ రోజున విషాదం.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లాలో బైక్ చెట్టును ఢీకొని ఇద్దరు మృతి చెందగా, హైదరాబాద్‌లో మెట్రో ఫిల్లర్‌ను ఢీకొని ఓ పాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలయ్యాడు.
తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. వరంగల్ జిల్లాలో బైక్ చెట్టును ఢీకొని ఇద్దరు మృతి చెందగా, హైదరాబాద్‌లో మెట్రో ఫిల్లర్‌ను ఢీకొని ఓ పాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలయ్యాడు. దీంతో న్యూ ఇయర్ రోజున మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడుకు చెందిన బత్తుల రాజు (30) గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, స్వగ్రామానికి వెళ్లిన రాజు.. తిరిగి నగరానికి బైక్‌పై వస్తున్నాడు. మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారనుకున్న సమయంలో చైతన్యపురి మెట్రో స్టేషన్ సమీపంలో అతివేగంతో మెట్రో పిల్లర్ నం.1550 డివైడర్‌ను ఢీకొని.. రోడ్డు అవతలివైపు పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. స్నేహితుడి బర్త్‌డే వేడుకలకు వెళ్లివస్తుండగా, వర్ధన్నపే నీలగిరి తాండ సమీపంలో బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వర్థన్నపేటలో స్నేహితుడి పుట్టనరోజు వేడుకలకు వెళ్లిన ముగ్గురు యువకులు తిరుగు పయనమయ్యారు. నీలగిరిస్వామి తాండ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంటారు. దీంతో ఐత శ్రీకాంత్(20), శ్రీశాంత్(18) తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు రేవంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.