AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganta Srinivasa Rao : అప్పుడు క్లారిటీ ఇస్తా.. పార్టీ మార్పుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్..

Ganta Srinivasa Rao : పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజకీయ..

Ganta Srinivasa Rao : అప్పుడు క్లారిటీ ఇస్తా.. పార్టీ మార్పుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్..
Shiva Prajapati
|

Updated on: Jan 01, 2021 | 8:32 AM

Share

Ganta Srinivasa Rao : పార్టీ మారతారంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచానని, టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్నానని తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఎన్నికల ముందు.. గెలిచాక తనపై అనేక కథనాలు వచ్చాయన్నారు. పార్టీ మారుతానని ప్రతిసారి పబ్లిసిటీ ఇస్తున్నారని, అవసరమైనప్పుడు అన్ని సందేహాలను నివృత్తి చేస్తానని గంటా పేర్కొన్నారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘అన్ని అంశాలను కాలమే నిర్ణయిస్తుంది.. నేనేంటో రాబోయే రోజుల్లో చెబుతా. సంతృప్తి అనేది రిలేటీవ్ టెర్మ్.. టీడీపీలో సంతృప్తి ఉందా? లేదా? అనేది త్వరలో చెప్తాను. టీడీపీలో ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం.. అసంతృప్తి అనేది వాళ్ల వ్యక్తిగతం. నేను ఏదైనా పార్టీలోకి వెళ్లదలచినా.. మరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. రహస్యంగా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ఉండదు. టీడీపీ నుంచి పీఆర్పీలో చేరినప్పుడు అధినాయకుడితో చెప్పి వెళ్లాను. అందరితో చర్చించాకే టీడీపీ వదిలి వెళ్లాను. నేను పార్టీ వీడుతానని, నా కొడుకు వెళ్తాడాని ఏవేవో కథనాలు వస్తున్నాయి. ఊహాగానాలకు నేను తెర దించను. ఆ ఆస్కారం కూడా ఇవ్వను. చాలా సార్లు స్పష్టం చేశాను. అటువంటి నిర్ణయాలు, మార్పులు జరిగితే అందరికీ చెప్పే చేస్తానని అప్పుడు చెబుతున్నా. ఇప్పుడూ చెబుతున్నా. మీడియాలో ప్రసారం చేసే ప్రతి కథనంపై.. ప్రతిసారీ స్పందించలేను.’ అని గంటా స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రజలందిరికీ గంటా శ్రీనివాసరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పిలుపుతో అంతా ఇళ్లలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారని, ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని గంటా ఆకాంక్షించారు. కోవిడ్ తగ్గినా.. స్ట్రెయిన్‌ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Also read:

New Year 2021: మాకు ఓర్పును నేర్పావు.. మా జీవితాలను మార్చేశావు.. ఎమోషనల్‏గా చిరంజీవి న్యూఇయర్ విషెస్..

Fire in Rajahmundry : కొత్త సంవత్సరం వేళ రాజమండ్రిలోని ఓ షాప్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు