ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కును ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ రోడు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కారులో కొందరు ప్రయాణికులు..

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ రోడు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి కారులో కొందరు ప్రయాణికులు లక్నోలో పెళ్లికి హాజరై షాజహాన్ పూర్ పట్టణానికి తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వేగంగా వస్తున్న కారు షాహబాద్ వద్ద ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదసమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తుండగా, వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మిగిలిన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగిందని హర్దోయి అదనపు పోలీసు సూపరింటెండెంట్ కపిల్ దేవ్ సింగ్ చెప్పారు.




