Corona Vaccination: కరోనా నుంచి కోలుకున్నారా..? అయితే వ్యాక్సిన్‌కు తొందర ఏమీ లేదంటోన్న వైద్యులు..
Corona Vaccination: కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. అయితే ఓపు కరోనా....
Corona Vaccination: కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. అయితే ఓపు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంటే మరోవైపు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండడం ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. కొందరు కేవలం 10 నుంచి 12 రోజుల్లో కరోనా నుంచి కోలుకుంటున్నారు. అయితే వీరిలో చాలా మంది కరోను నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. ఇది అవసరం లేదని చెబుతున్నారు వైద్య నిపుణులు.
కోలుకుంటే.. యాంటీ బాడీస్ ఉన్నట్లే..
కరోనా బారిన పడి కోలుకున్న వారికి కనీసం 8 వారాల వరకు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకుంటేనే శరీరంలో యాంటీ బాడీలు ఉన్నాయని అర్థమని చెబుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా వ్యాక్సిన్ అవసరం లేదంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత 90 రోజుల వరకూ వ్యాక్సిన్ అవసరం లేదని, ఆ తర్వాత వేయించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Corona Death: భయం.. కరోనా కంటే మహా ప్రమాదకరం.. కరోనా వచ్చిందేమోనని ఆత్మహత్య చేసుకున్న..
Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!