జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?
జబర్దస్త్ కామెడీ షోకు మంచి ఇమేజ్ ఉంది. గురు, శుక్ర వారాల్లో వచ్చే ఈ షో రేటింగ్స్‌లో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎంతో మంది నటులను బుల్లితెరకు పరిచయం చేసింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి కమెడియన్లు.. ఈ రోజు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారంటే..

జబర్దస్త్ కామెడీ షోకు మంచి ఇమేజ్ ఉంది. గురు, శుక్ర వారాల్లో వచ్చే ఈ షో రేటింగ్స్‌లో సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఎంతో మంది నటులను బుల్లితెరకు పరిచయం చేసింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి కమెడియన్లు.. ఈ రోజు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారంటే అది ఈ షోతోనే సాధ్యమైంది. అలాగే ఈ షో పలు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్‌గా మారుతూ వస్తోంది. అనంతరం గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్‌లో తగాదాల కారణంగా నవ్వుల నవాబు నాగబాబు షోను విడిచి అదిరిందిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత కొందరు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఆయనతో పాటు వెళ్లిపోయారు. అలాగే గత కొద్ది రోజుల క్రితం హైపర్ ఆది టీంలో చేసే కమెడియన్లు దొరబాబు, పరదేశీలు ఆ మధ్య వ్యభిచారం కేసులో దొరికిపోయారు.

దాంతో మిగిలిన జబర్దస్త్ కమెడియన్లపై కూడా ఈ ప్రభావం పడింది. అలాగే జబర్దస్త్ గురించి పలు ప్రచారాలు జరిగాయి. దీంతో వీరిని జబర్దస్త్ నుంచి తీసేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా హైపర్ ఆది టీంలో వీరిద్దరూ కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్లను బయటికి పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయట. నెక్ట్స్ షెడ్యూల్ నుంచి వీరిని హైపర్ ఆది టీంలో తీసుకోవద్దని మల్లెమాల టీం చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరితో ఉన్న అగ్రిమెంట్ కారణంగా వీరిని కొనసాగించినట్టు సమాచారం. అలాగే వీరు ఇప్పుడు అదిరింది కామెడీ షోకి జంప్ అయినట్లు కూడా మరో ప్రచారం కూడా జరుగుతోంది. పరదేశీకి ప్రస్తుతం అంత క్రేజ్ లేకపోయినా.. దొరబాబు మాత్రం సీనియర్ కమేడియన్.
ఇవి కూడా చదవండి:
ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది
లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!
హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి
బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం
మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..