బెంగాల్ లో షాపులన్నీ తెరవండి.. దీదీ.. కేంద్ర మంత్రి ఫైర్

రాష్ట్రంలో స్వీట్, పాన్, పూల మార్కెట్లన్నీ తెరవాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇఛ్చిన పిలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్  సుప్రియో మండిపడ్డారు.

బెంగాల్ లో షాపులన్నీ తెరవండి.. దీదీ.. కేంద్ర మంత్రి ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 11, 2020 | 8:39 PM

రాష్ట్రంలో స్వీట్, పాన్, పూల మార్కెట్లన్నీ తెరవాలంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇఛ్చిన పిలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్  సుప్రియో మండిపడ్డారు. లాక్ డౌన్ కాలంలో, కరోనాను అదుపు చేయవలసిన ఈ సమయంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యానికి పెను చేటుగా, హానికరంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా హౌరా లోని అతి పెద్ద పూల మార్కెట్ ను ఓపెన్ చేయాలన్న ఉత్తర్వులు.. కరోనా నియంత్రణ పట్ల ఈ రాష్ట్రానికి శ్రధ్ధ లేదన్న తప్పుడు సంకేతానికి దారి తీస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఆదేశాలు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తాయి.. ఈ మార్కెట్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. సోషల్ డిస్టెన్స్ అన్న మాటే ఉండదు.. కరోనా వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకోవలసింది పోయి.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా .. ఏమైనా అంటే నేను రాజకీయం చేస్తున్నానని అంటారు అని బాబుల్ సుప్రియో ట్వీటించారు. ముఖ్యమంత్రి ఇఛ్చిన ఉత్తర్వులను ధిక్కరించాలని, ప్రజలంతా ఇళ్లలోనే ఉండి.. కోవిద్ వ్యాధి నివారణకు తోడ్పడాలని, లాక్ డౌన్ నియమాలను పాటించాలని ఆయన కోరారు.