మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..

ఓ వైపు కరోనాను జయించడానికి దేశమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే.. మరో వైపు ఇదే అదనుగా భావించిన కొందరు.. మహిళలు, అమ్మాయిలు, బాలికలపై పలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఓ వాట్సాప్‌ నెంబర్‌ను..

మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 7:55 PM

ఓ వైపు కరోనాను జయించడానికి దేశమంతా కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే.. మరో వైపు ఇదే అదనుగా భావించిన కొందరు.. మహిళలు, అమ్మాయిలు, బాలికలపై పలు దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఓ వాట్సాప్‌ నెంబర్‌ను కేటాయించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ వాట్సాప్ నెంబర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మహిళా కమిషన్ పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో గృహ హింస ఎదుర్కొంటున్న మహిళ కోసం ఓ వాట్సాప్ నెంబర్‌ని జాతీయ మహిళా కమిషన్ తీసుకొచ్చింది. మహిళలకు, అమ్మాయిలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఈ నెంబర్‌కి మెసేజ్ చేయాలని తెలిపింది.

ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మా మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో గృహహింస లాంటి సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయన్నారు. లాక్‌డౌన్ కారణంగా గృహ హింసపై ఫిర్యాదు చేయలేకపోయిన మహిళలు 7217735372లో వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వాట్సాప్ నంబర్ 7217735372కు మెసేజ్ చేయడం ద్వారా ఇలాంటి కేసులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కమిషన్ ట్వీట్ చేసి ప్రజలను కోరింది. తద్వారా ఒత్తిడిలో ఉన్న లేదా గృహ హింసకు గురైన మహిళలకు ఏజెన్సీ సహాయం అందించగలదన్నారు. దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్నంత వరకు మాత్రమే ఈ నెంబర్ పనిచేస్తుందని కమిషన్ తెలిపింది. ఈ సేవ శాశ్వతం కాదని, లాక్‌డౌన్ తొలగించిన వెంటనే ఈ సేవ కూడా నిలిపివేయబడుతుందని రేఖ శర్మ తెలిపారు.

వాట్సాప్ నెంబర్: 72177 35372

ఇవి కూడా చదవండి:

కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం

కరోనా వ్యాప్తి: కరెన్సీ వద్దు.. డిజిటల్ చెల్లింపులే చేయండి..

కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..